సారి..దిగజార్చుకోలేను: హన్సిక
బాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్ అంటే... దానికి డిఫరెంట్ మీనింగ్ ఉంది. కానీ ఇక్కడ అలా కాదు. ఐటమ్ సాంగ్స్ అంటే చిన్నచూపు ఎక్కువ. అందుకే డబ్బుమీద మోజుతో నా స్థాయిని దిగజార్చుకోలేను అని స్పష్టం చేసింది హన్సిక. ఆమె రీసెంట్ గా విక్రమ్ హీరోగా చేసిన వీడింతే..బై బర్త్ చిత్రంలో ఐటమ్ సాంగ్ కి అడిగితే రిజెక్టు చేసింది. దాంతో నిర్మాతలు యాభై లక్షల రూపాయలు వరకూ ఆఫర్ చేసారు. అయినా ఆమె చెయ్యలేదు. దాంతో ఆమెపై విక్రమ్ లాంటి హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ రిజెక్టు చేస్తావా అని కారాలు మిరియాలు నూరారు. ఆ విషయం మీడియా ఆమె వద్ద ప్రస్దావిస్తే ఆమె ఇలా స్పందించింది. అలాగే గతంలో ఆమె ప్రభాస్ చేసిన భిళ్లాలో ఐటం సాంగ్ చేసింది. దాని విషయం చెప్తూ..'బిల్లా'లో ఐటమ్‌సాంగ్ చేశానంటే దానికి కారణం మెహర్ రమేష్. నన్ను ఆయన సొంతం చెల్లిలా చూసుకుంటారు.
అన్నయ్య అడిగితే కాదనలేక 'బిల్లా'లో ఐటమ్ సాంగ్ చేశాను. చేస్తున్నప్పుడే అనుకున్నాను నా కెరీర్‌లో ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని. నేను మొదట్నుంచీ ఐటమ్స్ సాంగ్స్‌కి వ్యతిరేకినే. నాకు డబ్బే ముఖ్యం కాదు. దాని కోసమని నా స్థాయిని తగ్గించుకోలేను అంది.ఇక హన్సిక రీసెంట్ గా తెలుగులో నటించిన కందిరీగ చిత్రం మంచి విజయం సాధించింది. అలాగే ఆమె సిద్దార్ద సరనస దిల్ రాజు నిర్మాతగా చేసిన ఓహ్ మై ప్రెండ్ చిత్రం భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక తమిళంలో విజయ్ సరసన చేసిన వేలాయిధం చిత్రం మంచి విజయం సాధించింది. వేలాయుధం చిత్రం తెలుగులో గతంలో నాగార్జున చేసిన అజాద్ కు రీమేక్.


Click it and Unblock the Notifications











