నన్నలా పిలవద్దు, రాయద్దు...మీడియాకు హన్సిక రిక్వెస్ట్
హాట్ స్టార్ హన్సికకు ఈ మధ్య కొత్త భయం పట్టుకుంది. తన పూర్తి పేరు అయిన హన్సిక మొత్వాని లో మొత్వాని అని ఉండటం వల్లే అవకాశాలు తగ్గుతున్నాయని. దాంతో సెంటిమెంట్స్ విపరీతంగా నమ్మే ఆమె మీడియావారిని కేవలం హన్సిక అనే రాయమని, మొత్వాని అనేది తీసేయమని పనిగొట్టుకుని చెప్తూ రిక్వెస్ట్ చేస్తోంది. అయితే ఈ పేరు హడావిడి అంతా తమిళంలో ఆమె రీసెంట్ గా చేసింది. అక్కడ ఆమె ధనుష్ సరసన మాపిళ్ళై చిత్రంలో చేస్తోంది. తెలుగులో జయీభవ, సీతారాముల కళ్యాణం లంకలో..అనంతరం ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో తన పేరులో లోపం ఉన్నదని అనిపించి ఇలా జాగ్రత్తలు తీసుకోవటం మొదలెట్టింది. ఇక ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయి దేశముదురు భామకు ఆఫర్స్ వస్తాయో..రావో అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











