పార్టీలు, పబ్ లు అంటూ హన్సిక నైట్ రౌండ్స్ నిజమేనా?
తాను పార్టీల పేరుతో పబ్‌ల చుట్టూ తిరుగుతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని హన్సిక స్పష్టం చేసింది. అయినా తాను రాత్రి తొమ్మిది గంటలకే నిద్రపోతానని, తొమ్మిది గంటలకు పది నిమిషాల ముందే తన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఆఫ్ చేస్తానని చెప్పుకొచ్చింది. హన్సిక రీసెంట్ గా చెన్నైలోని పబ్ లు, పార్టీలు ను పావనం చేస్తోందంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇలా స్పందించింది. అలాగే తాను పార్టీలకు, పబ్‌లకు తిరిగే అమ్మాయిని కాదని చెప్పింది. ఇక తమిళంలో తాను నటించిన మాప్పిళ్లై, ఎంగేయుమ్ కాదల్ చిత్రాలు విజయం సాధించాయని తెలిపారు. ప్రస్తుతం జయం రాజా దర్శకత్వంలో విజయ్‌కు జంటగా వేలాయుధం, ఉదయనిధి స్టాలిన్ సరసన ఒరుకల్ ఒరు కన్నాడి చిత్రంలో నటిస్తున్నానని పేర్కొన్నారు. వేలాయుధం చిత్రంలో మరో హీరోయిన్‌గా జెనీలియా నటిస్తున్నారని తెలిపారు. అలాగే జెనీలియా నటించడం వల్ల భయపడుతున్నారా అని అందరూ అడుగుతున్నారని, ఇందులో ఒకర్ని చూసి మరొకరు భయపడాల్సిన పనిలేదని అన్నారు.


Click it and Unblock the Notifications











