ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చేసింది...హన్సిక
ఎంత జాగ్రత్తగా ఉన్నా జ్వరం వచ్చేసింది. షూటింగ్‌లకు హాజరుకాలేకపోతున్నాను" అని రీసెంట్ గా ట్వీట్ చేసింది హన్సిక. ప్రస్తుతం హన్సిక తమిళంలో 'మాప్పిళ్ళై' షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు ప్రభుదేవా దర్శకత్వంలో 'ఇచ్' కూడా సెట్స్‌మీద ఉంది. 'మాప్పిళ్ళై' హీరో ధనుష్ జ్వరం కారణంగా హాస్పిటల్‌లో చేరాడు. ఈ విషయం గురించి కూడా హన్సిక ట్విట్టర్ లో రాస్తూ...ధనుష్‌కి జ్వరం తీవ్రత పెరిగి హాస్పిటల్‌లో చేరాడు. తను త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. మరోవైపు నాకు కూడా బాగా అస్వస్ధతగా ఉంది అంది. ఈ దేశముదురు భామ త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు. ఇక హన్సిక కు తెలుగులో జయీభవ, సీతారాముల కళ్యాణం తర్వాత ఏ ఆఫరూ కమిటవ్వలేదు.


Click it and Unblock the Notifications











