ఆ హీరోయిన్ తో పోలుస్తున్నారని భయపడుతున్న హన్సిక
దేశముదురు హన్సిక ఇప్పుడు తమిళంలోనూ బిజీ స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఆమె అక్కడ మరింతగా పాతుకుపోవాలని అక్కడవారికి నచ్చుతుందనే అభిప్రాయంతో కాస్త ఒళ్ళు చేసింది. దాంతో అక్కడ మీడియా వెంటనే జూనియర్ నమిత అనే బిరుదుని ఇచ్చి కవర్ పేజీలకు ఎక్కించేసారు. దాంతో ఆమె వెంటనే భయపడిపోయింది. మళ్లీ తన పాత అందాలను కోసం స్లిమ్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. తనలాగే తాను ఉండక అనవసరంగా నమితను చూసి లావవ్వడానికి ప్రయత్నించి, మళ్లీ నమిత భయంతోనే సన్నబడే ప్రయత్నం చేయడం ఎందుకని తమిళ సినీ వర్గాలు నవ్వుకుంటున్నాయి. మొత్తానికి నమిత భారీ ఆకారం చూసి హన్సికకు భయం పట్టుకుంది.ఇక ఇటీవల విడుదలైన తొలి చిత్రం మాప్పిళ్లైలో హీరోయిన్‌గా మంచి మార్కులే కొట్టేసింది. జయం రవితో కలిసి నటించిన ఎంగేయుమ్ కాదల్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విజయ్ సరసన వేలాయుధం, ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా ఒరుకల్ ఒరు కన్నాడి చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. తెలుగులో రామ్ సరసన కందిరీగ చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











