»   » హన్సిక క్రేజ్ తోనే నితిన్‌ చిత్రం బిజినెస్

హన్సిక క్రేజ్ తోనే నితిన్‌ చిత్రం బిజినెస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  చెన్నై : హిట్ లతో ఉషారుగా ఉన్న యంగ్ హీరో నితీన్‌ హీరోగా తెలుగులో విడుదలైన చిత్రం 'సీతారాముల కల్యాణం'. 'లంకలో' అన్నది టాగ్‌లైన్‌. హన్సిక హీరోయిన్ గా నటించింది. సుమన్‌ జేపీ, బ్రహ్మానందం తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో 'రౌడీ కోట్త్టె'గా అనువాదమవుతోంది. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా ఉండటంతో ఆమెకు తమిళంలో మార్కెట్ ఉండటంతో మంచి బిజినెస్ చేస్తున్నారని సమాచారం. తమిళంలో నితిన్ కి మార్కెట్ లేకపోయినా హన్సిక ప్లస్ అవటం...అనువాదానికి ఈజీ అయ్యింది.


  తమిళ వెర్షన్ మాటల రచయిత ఏఆర్‌కే రాజరాజా మాట్లాడుతూ.. '' విలన్‌ ఇంటికి వెళ్లి హీరో.... హీరోయిన్‌ను ఎలా పెళ్లి చేసుకుంటాడనేదే కథ. హాస్యం, యాక్షన్‌ కలగలసిన కమర్షియల్‌ చిత్రమిది. సెంటిమెంట్‌కూ కొదవుండదు. యువతకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది'అని పేర్కొన్నారు.

  ఇక తమిళంలో ఈ చిత్రాన్ని శివం అసోసియేట్స్‌ బ్యానరుపై ఎస్‌.సుందరలక్ష్మి నిర్మిస్తున్నారు. ఏఆర్‌కే రాజరాజా మాటలు రాశారు. అనూప్‌రూబెన్‌ సంగీతం సమకూర్చారు. ఈశ్వర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఒకట్రెండు నెలల్లో తమిళతెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం హిట్టైతే మరిన్ని నితిన్ సినిమాలు తమిళంలోకి అనువాదమయ్యి...నితిన్ కి అక్కడ మార్కెట్ ఏర్పడుస్తాయనటంతో సందేహం లేదు.

  ప్రస్తుతం నితిన్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న 'హార్ట్ ఎటాక్' చిత్రం షూటింగుకు కు రెడీ అవుతుున్నారు. ఈచిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది. త్వరలో ఈచిత్రంలో హీరోయిన్ వివరాలతో పాటు సాంకేతిక విభాగం వివరాలు వెల్లడికానున్నాయి. షూటింగ్ మొదలైన తర్వాత గోవా, యూరఫ్‌లలో భారీ షెడ్యూల్ జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసారు

  English summary
  "Eshwar's Seeta Ramula Kalyanam, starring Nitin and Hansika, will be dubbed into Tamil as Rowdy Kottai. Rajaraja, who has penned the Tamil dialogues for more than 300 films, is working on the lines for this film, and the dubbing process has already begun. The film is slated to release next month."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more