నిజ జీవితంలో ఓ వ్యక్తికి ప్రాణదానం చేసిన హన్సిక
హాట్ స్టార్ హన్సిక..తెరమీదే కాదు నిజజీవితంలోనూ హీరోయిన్ అనిపించుకుంది. ఈ మధ్యన బైకు యాక్సిడెంట్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడి అందరిచేత శభాష్ అనిపించుకుంది. సంఘటన వివరాల్లోకి వెళితే...'ఓకే ఓకే' షూటింగ్ నిమిత్త మధురై కారులో వెళ్ళుతున్న హన్సిక ఓ వ్యక్తి బైకుతో ఫుట్‌పాత్‌ని డీ కొట్టి రక్తపు మడుగులో పడి ఉండటం గనించింది. రోడ్డుపై వెళ్ళే వారంతా చూస్తున్నారే గానీ ఆగి అతన్ని హాస్పటిల్ కి తీసుకువెళ్ళటానికి ముందుకు రావటం లేదు.
అప్పుడు హన్సిక వెంటనే కారు ఆపి వెంటనే అంబులెన్స్‌కి సమాచారం అందించింది. అంబులెన్స్ వచ్చి ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించేంత వరకూ స్పాట్‌లో ఉండి ఆ తరువాత ఆసుత్రికి కూడా వెళ్లి ట్రీట్‌మెంట్ ఇచ్చేవరకూ అక్కడే ఉంది హన్సిక. అలాగే హన్సిక తల్లి కూడా డాక్టర్ కావడంతో ఆమెను వెంటబెట్టుకుని వెళ్లింది.అతను ప్రాణాలతో బ్రతికి బయిటపడ్డాడు. సకాలంలో వ్యక్తి ప్రాణాలు కాపాడిన హన్సికను అక్కడున్న వారంతా అభినందించారు.


Click it and Unblock the Notifications











