Happy Birth Day Vishal పవర్‌ఫుల్‌గా మార్క్ ఆంటోని.. పాన్ ఇండియా మూవీ ఫస్ట్ లుక్‌తో అదరగొట్టిన విశాల్
విభిన్నమైన కథలతో విలక్షణ నటనతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న యువ హీరో పురచ్చి దళపతి విశాల్. సరికొత్త గెటప్స్‌తో పవర్ ఫుల్ పాత్రతో ఆయన నటిస్తున్న చిత్రం మార్క్ ఆంటోని. ఈ సినిమా విశాల్ కెరీర్‌లో 33వ సినిమా కావడం విశేషంగా మారింది. దక్షిణాదిలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు పొందిన మినీ స్టూడియోస్ పతాకంపై రీతూ వర్మ, సునీల్ వర్మ, అభినయ, వైజీ మహేంద్రన్ నిలగళ్ రవి, కింగ్స్‌లీ నటించిన ఈ చిత్రం పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్నది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.
ఖుషీ దర్శకుడు, స్పైడర్ చిత్రంలో విలన్‌గా నటించిన ఎస్‌జే సూర్య మార్క్ ఆంటోని చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతున్నది.
హీరో విశాల్ జన్మదినం ఆగస్టు 29. ఆయన పుట్టిన రోజున చిత్ర యూనిట్ మార్క్ ఆంటోని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించడం గమనార్హం.

మార్క్ ఆంటోని ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విశాల్ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా విభిన్నమైన గెటప్‌లో కనిపించాడు. భారీగా పెంచిన గడ్డం, ముఖంలో రౌద్రం, చేతిలో తుపాకి.. ఆవేశంగా శత్రువుపై ఎక్కు పెట్టి దిక్కులు పిక్కటిల్లేలా అరుపు ఫస్ట్ లుక్‌కు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యాక్ డ్రాప్‌లో జరిగిన విధ్వంసం తాలుకు ఛాయలు సినిమాలోని ఇంటెన్సిటిని తెలియజెప్పాయి. దాంతో ఈ సినిమాపై విశాల్ అంచనాలు పెంచినట్టు కనిపించింది.
నటీనటులు: విశాల్, ఎస్‌జే సూర్య, రీతూ వర్మ, సునీల్ వర్మ, అభినయ, YGee మహేంద్రన్, నిలగళ్ రవి, కింగ్స్‌లీ తదితరులు
బ్యానర్: మినీ స్టూడియోస్
నిర్మాతలు: ఎస్ వినోద్ కుమార్, మినీ స్టూడియోస్
రచయిత, దర్శకుడు: అధిక్ రవిచంద్రన్
సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
డీవోపీ: అభినందన్ రామానుజం
ఆర్ట్ డైరెక్టర్: ఆర్ విజయ్ మురుగన్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
యాక్షన్ డైరెక్టర్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్, కనల్ కన్నన్, రవివర్మ
కాస్ట్యూమ్ డిజైనర్: సత్య ఎన్‌జే
కొరియోగ్రఫీ: దినేష్, బాబా భాస్కర్, అజహర్
గీత రచయితలు: మధుర కవి, అసల్ కొలారు, అధిక్ రవిచంద్రన్
పబ్లిసిటీ డిజైన్స్: కబిలన్


Click it and Unblock the Notifications











