twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే రజనీ ఎదురులేని సూపర్ స్టార్ అయ్యాడు, మీకు తెలియని ఆసక్తికర విషయాలు!

    |

    సూపర్ స్టార్ రజనీకాంత్... సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎదురులేని స్టార్. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన అటు నార్త్ ఇండియా మాత్రమే కాదు, జపాన్, మలేషియా లాంటి దేశాల్లోనూ తన స్టార్ డమ్ విస్తరించుకున్నారు.

    గత కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఇటు సౌత్, అటు నార్త్ అనే తేడా లేకుండా దేశం మొత్తం తన సినీ సామ్రాజ్యాన్ని విస్తరించిన ఒకేఒక సూపర్ స్టార్ రజనీకాంత్. నేడు రజనీ 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

     సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్

    సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్

    రజనీకాంత్ సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. ఒక సాధారణ బస్ కండక్టర్‌గా కర్నాటలో కెరీర్ మొదలే పెట్టిన రజనీ తన రాష్ట్రం కాని రాష్టంలో ఎవరూ సాధించలేని విజయాన్ని అందుకున్నారు. అఫ్ కోర్స్ సౌత్‌లో ఇంకా చాలా మంది సెల్ఫ్ మేడ్ సూపర్ స్టార్లు ఉన్నప్పటికీ రజనీ స్థాయిని మాత్రం ఎవరూ అందుకోలేక పోయారు.

    సూపర్ స్టార్ రజని బర్త్ డే.. మహేష్, అమితాబ్, కమల్ ఏమన్నారో తెలుసా! సూపర్ స్టార్ రజని బర్త్ డే.. మహేష్, అమితాబ్, కమల్ ఏమన్నారో తెలుసా!

    ఆయన్ను ఆ స్థాయికి తీసుకెళ్లింది అవే

    ఆయన్ను ఆ స్థాయికి తీసుకెళ్లింది అవే

    రజనీకాంత్‌ను అతి తక్కువ కాలంలో టాప్ స్టార్ గా ఎదగడానికి కారణం అతడి యాక్టింగ్ టాలెంటుతో పాటు... ఎవరికీ లేని ఒక యూనిక్ స్టైల్ స్టేట్మెంట్ అతడిలో ఉండటమే. అదే ఆయన్ను సూపర్ స్టార్ నిలబెట్టిందని చెప్పక తప్పదు.

     ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, సాధారణ జీవితం

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, సాధారణ జీవితం

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం రజనీది అని అంటుంటారు ఆయన సన్నిహితులు, అభిమానులు. సూపర్ స్టార్ గా కోట్లు సంపాదిస్తున్నా ఇప్పటికీ ఆయన సాధారణ జీవితం గడుపుతుంటారు. డబ్బు, స్టార్ ఇమేజ్ ఉందనే గర్వం ఆయనలో ఏ మాత్రం కనిపించదు.

    సేవా భావం ఎక్కువే...

    సేవా భావం ఎక్కువే...

    సేవాగుణంలోనూ రజనీకాంత్ ఎన్నో సందర్భాల్లో తన గొప్ప మనసు చాటుకున్నారు. అంతే కాదు తన సినిమాల వల్ల ఎవరైనా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే తన వంతు సహాయం చేసి వారిని కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంటారు.

    హోళీ రోజునే రజనీకాంత్ అయ్యారు

    హోళీ రోజునే రజనీకాంత్ అయ్యారు

    తన గురువు బాలచందర్‌ జీవించి ఎన్నంతకాలం ప్రతి హోళీ పండగ రోజున ఆయనకు ఫోన్‌చేసి యోగక్షేమాలు తెలుసుకునే వారు. కానీ ఆ రోజే ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయం బాలచందర్‌కూ తెలియదు. తీరా కొన్ని సంవత్సరాల తర్వాత అడిగితే.. 'నాకు రజనీకాంత్‌ అని పేరు పెట్టింది హోలీ రోజునే సార్‌!'అన్నారట. రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావ్ గౌక్వాడ్.

    ఆసక్తికర విషయాలు

    ఆసక్తికర విషయాలు

    రజనీకాంత్‌ ఉన్నప్పుడు ఇంటిలో నిత్యం 'ఓం'కార నాదం వింటూనే ఉంటారు.
    ఇష్ట దైవం వినాయకుడు. తిరుపతి ఆలయంలోనే రజనీకాంత్‌ వివాహం జరిగింది.
    రోడ్డుపక్కనున్న కాకా హోటళ్ల ప్రియుడు రజనీ. పోరూర్‌ సిగ్నల్‌లోని ఓ రెస్టారెంట్‌కు తరచూ వెళ్లొస్తారట.
    మెరీనాలో విక్రయించే వేరుశనగలంటే రజనీకాంత్‌కు చాలా ఇష్టం.

     ఈ విషయాలు మీకు తెలుసా?

    ఈ విషయాలు మీకు తెలుసా?


    ఏవీఎం స్టూడియోలో రజనీకాంత్‌ మేకప్‌రూమ్‌ నెం.10
    చెన్నైలో షూటింగ్‌ అంటే రజనీకే కాకుండా, మరో 25 మంది వరకు భోజనం ఇంటి నుంచే వెళ్తుంది.
    తన ఇంటిలో ఉద్యోగం చేస్తున్న అందరికీ నీలాంగరైలో ఓ ప్లాట్‌ను కొనిచ్చారు. వారిపేరుపై కొంత మొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కూడా చేశారు.
    'ఓ వ్యక్తి దేనినైనా దక్కించుకోవాలని బలంగా ప్రయత్నిస్తే.. ప్రపంచంలోని ఏ శక్తి ఆపజాలదు'.. స్వామి వివేకానందుడి ఈ సూక్తే రజనీకాంత్‌ గుమ్మంపై ఉంటుంది.

    తొలి పంచ్ డైలాగ్

    తొలి పంచ్ డైలాగ్

    రజనీకాంత్‌ మాట్లాడిన తొలి పంచ్‌ డైలాగ్‌ 'ఇదు ఎప్పడి ఇరుక్కు'(ఇది ఎలా ఉంది?)
    రజనీకాంత్‌ మాంసాహార ప్రియుడు. ముఖ్యంగా మటన్‌, తలకాయ కూరంటే ఇష్టంగా తింటారు.
    తన చిత్ర షూటింగ్‌ పూర్తయ్యాక ఆ చిత్ర సహాయ దర్శకుడికి ఓ మొత్తాన్ని కానుకగా ఇవ్వటం రజనీకాంత్‌ అలవాటు. ఆ మొత్తం కనీసం రూ.50 వేలు.
    తమిళంతోపాటు, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠి, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.

    ఆయన దర్శకత్వంలోనే ఎక్కువ సినిమాలు

    ఆయన దర్శకత్వంలోనే ఎక్కువ సినిమాలు

    అత్యధికంగా ఎస్‌.పి.ముత్తురామన్‌ దర్శకత్వంలో 25 చిత్రాల్లో నటించారు.
    హిమాలయాలనే కాకుండా ఏ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లినా అక్కడి రుద్రాక్షలను సేకరిస్తూ ఉంటారు. అలా సేకరించిన రుద్రాక్షలు రజనీ ఇంటిలో కుప్పలతెప్పలుగా ఉంటాయి.
    తనకు నచ్చిన పాటకు సంగీత దర్శకుడెవరో తెలుసుకుని ఫోన్‌ చేసి వారిని అభినందిస్తారు.
    తనకు ఎంత ఆప్తులైనా వారి కోసం సిఫారసు మాత్రం చేయరు.

     సిగరెట్ మానేశారు

    సిగరెట్ మానేశారు


    సిగరెట్‌ తాగటం చాలా ఇష్టం. అయితే ఇప్పుడా అలవాటు మానుకున్నారు.
    రజనీకాంత్‌కు ఎక్కువ చిత్రాలకు సంగీతం అందించిన ఘనత ఇళయరాజాదే. ఇళయరాజాను 'స్వామి' అంటూ మర్యాదగా సంబోధిస్తారు.
    పర్సు, క్రెడిట్‌ కార్డులు వాడే అలవాటు లేదు. బయకెళ్లినప్పుడు ప్యాకెట్‌ మనీగా కొంత మొత్తాన్ని మాత్రమే తీసుకెళ్తారు.
    అప్పుడప్పుడు స్నేహితుల ఇంటికి అకస్మికంగా వెళ్లి వారిని ఉత్సాహ పరుస్తుంటారు. తనతో ఫొటో దిగేందుకు వచ్చే వారిలో చిన్నారులుంటే వారిని ఎత్తుకుని ఫోజివ్వటం రజనీకాంత్‌ అలవాటు.

    అలా చేయడం ఇష్టం

    అలా చేయడం ఇష్టం

    పోయస్‌గార్డెన్‌లోని రజనీకాంత్‌ ఇంటి పేరు 'బృందావన్‌'. ఇది ఆయనే పెట్టుకున్నారు. దానిపై 'సత్యమేవజయతే..' అని పెద్దక్షరాలతో లిఖించారు.
    విమాన ప్రయాణాలకన్నా రైలు ప్రయాణాలకే రజనీకాంత్‌ మొగ్గుచూపుతారు.
    బూట్లు ధరించటాన్ని ఇష్టపడరు. షూటింగ్‌ సందర్భంలో కూడా అవసరం మేరకే. చెప్పులు ధరించటమే ఇష్టం.
    ఖాళీగా ఉంటే రోజూ రెండు చిత్రాలను చూడటం అలవాటు. వాటిలో ఒకటి తప్పనిసరిగా ఆంగ్లం ఉంటుంది.

    మరీ అంత సాఫ్ట్ కాదు

    మరీ అంత సాఫ్ట్ కాదు


    ఇరవైసార్లుకు పైగా రక్తదానం చేసిన అభిమానులకు తన సంతకంతో కూడిన ప్రశంసాపత్రం అందించటం రజనీ అలవాటు.
    తొలినాళ్లలో నలుపు వస్త్రాలను ఇష్టపడే రజనీకాంత్‌ ప్రస్తుతం తెలుపునకు మారారు.
    రజనీకాంత్‌ నటించిన ఏకైన ఆంగ్ల చిత్రం 'బ్లాడ్‌ స్టోన్‌' 1988 అక్టోబరు 7న విడుదలైంది.
    'నేను ఆధ్యాత్మికవేత్తనే. అయితే ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించాలన్నంత కాదు. అలాంటి పద్ధతి నాకు ఇష్టం లేద'ని ఓసారి వ్యాఖ్యానించారు.
    తన వద్ద 25 ఏళ్లుగా విధులు నిర్వహించి విరమణ పొందిన వ్యక్తిగత సహాయకుడు జయరామన్‌కు నేటికీ వేతనం అందిస్తూనే ఉన్నారు.

    విదేశాలకు వెళ్లినపుడు అలా

    విదేశాలకు వెళ్లినపుడు అలా


    విదేశాలకు వెళ్లినప్పుడు సరదాగా అక్కడి బస్సుల్లో నిల్చొనే ప్రయాణిస్తారు. కారణం అడిగితే కండక్టర్‌ కాలం నాటి అలవాటు అని చెబుతుంటారు.
    అల్లుడు ధనుష్‌ ప్రతి పుట్టినరోజుకు ఓ వెండి కంచం, గ్లాస్‌ కానుకగా ఇస్తుంటారు.
    'ముల్లుం మలరుం' చిత్రంలో తన నటనను ప్రశంసిస్తూ కె.బాలచందర్‌ రాసిన ఉత్తరాన్ని నేటికీ ఆయన భద్రంగా దాచుకున్నారు.
    గతంలో రజనీ తన కుడిచేతికి కడియం ధరించేవారు. ఇప్పుడది నెల్త్లెకి చెందిన తన అభిమాని తిరుమారన్‌ కు బహుమతిగా వెళ్లింది.

    English summary
    As far as the fans of Tamil cinema are concerned , the iconic Rajinikanth is a name that well and truly needs no introduction at all. Fondly referred to as 'Thalaiva', the actor is considered to be a demigod because of his charismatic personality, bindass nature and stylish on-screen mannerisms. Moreover, he has starred in a host of unforgettable films and this has helped him become a brand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X