హ్యాపీడేస్ రీమేక్ దర్శకుడిగా జల్సా కెమరామెన్
చాపకిందనీరులా సంచలన విజయం సాధించి మరిన్ని ప్రింట్ల రూపొందించిబడుతున్న చిత్రం హ్యాపీడేస్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ నిర్మాతగా డ్యూయెట్ ఫిల్మ్స్ పతాకంపై హ్యాపీడేస్ ను తమిళంలోకి రీమేక్ చేయనున్నారు. తమిళ ప్రముఖ కెమరామెన్ కె.వి.గుహన్ రీమేక్ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. కె.వి.గుహన్ తెలుగులో అతడు, నానీ, పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న జల్సా సినిమాలకు కెమరామెన్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈయన రీమేక్ కు సంబంధించిన పనిని మొదలెట్టినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











