twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ముగ్గురు ఖాన్లకు పోటీ కాదు.. బాలీవుడ్‌‌ను వారికే వదిలేశా.. హర్బజన్ సింగ్

    |

    క్రికెట్ మైదానంలో తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హర్బజన్ సింగ్ ఇప్పుడు ఒక జీవితాన్ని ప్రారంంచారు. ఫ్రెండ్‌షిప్ అనే సినిమా ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నారు. జాన్ పాల్ రాజ్, షామ్ సూర్య కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భజ్జీ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో హర్బజన్‌ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

    ఫ్రెండ్‌షిప్ చిత్రంతో కోలీవుడ్‌లోకి

    ఫ్రెండ్‌షిప్ చిత్రంతో కోలీవుడ్‌లోకి


    ఫ్రెండ్‌షిప్ చిత్రంలో నేను ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా నటిస్తున్నాను. అయితే విద్యార్థి పాత్రను పోషించడంపై మొదట్లో భయంగా ఉండేది. ఆ తర్వాత నటించడం ప్రారంభించిన తర్వాత కొత్త అనుభూతికి గురయ్యాను. ఆ తర్వాత కాలేజీ స్టూడెంట్ పాత్రకు సరిగానే సరిపోయానని అనిపించింది. అంకుల్ మాదిరిగా మాత్రం కనిపించను అని హర్బజన్ సింగ్ అన్నారు.

    ఖాన్‌లకు పోటీ కాదు..

    ఖాన్‌లకు పోటీ కాదు..

    బాలీవుడ్‌లో కాకుండా తమిళ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టడంపై సరదాగా స్పందిస్తూ.. హిందీ చిత్ర పరిశ్రమను ఖాన్ హీరోలకు వదిలేశాను. వారికి నేను పోటీ కాదలుచుకోలేదు. నేను తమిళం, పంజాబీ సినిమా పరిశ్రమలకు చూసుకొంటాను. నాకు తమిళ ప్రజలతో మంచి అనుబంధం ఉంది. నాపై వారు కురిపించే ప్రేమ మాటల్లో చెప్పలేను అని హర్బజన్ తెలిపారు.

    తమిళగడ్డతో ఏదో అనుబంధం

    తమిళగడ్డతో ఏదో అనుబంధం

    తమిళ గడ్డతో నాకు ఎదో తెలియని బంధం ఉంది. నేను గతంలో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడాను. తమిళం రాకపోయినా కొంత అర్ధం చేసుకోగలను. నాకు సెట్లో ఓ ట్రాన్స్‌లేటర్‌ను ఏర్పాటు చేశారు. దాంతో చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి. తప్పకుండా ఫ్రెండ్‌షిప్ సినిమా అందరికీ నచ్చుతుంది అని హర్బజన్ తెలిపారు.

    నా భార్య వద్దని చెప్పింది

    నా భార్య వద్దని చెప్పింది

    ఇప్పటి వరకు ఎందరో క్రికెటర్లు సినిమా పరిశ్రమకు వచ్చి సక్సెస్ కాలేదనే విషయం నాకు తెలుసు. నా భార్య గీతా బర్సా కూడా సినిమాల్లో నటించవద్దని వారించింది. యాక్టింగ్ అనేది అందరికీ సూట్ కాదు. కాబట్టి సినిమా రంగానికి వెళ్తొద్దని చెప్పింది. అయితే నేను కన్విన్స్ చేసి ఫ్రెండ్‌షిప్ సినిమాలో భాగమయ్యాను. లాక్‌డౌన్ ముందు వరకు షూట్ జరిగింది. ఇంకా 20 రోజుల షూటింగ్ మిగిలి ఉంది అని హర్బజన్ సింగ్ అన్నారు.

    యాక్టింగ్‌లో కొనసాగాలా వద్దా

    యాక్టింగ్‌లో కొనసాగాలా వద్దా

    ఫ్రెండ్ షిప్ సినిమా తర్వాత యాక్టింగ్‌లో కొనసాగాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. ఈ సినిమా ఆడే తీరును బట్టి నటుడిగా కొనసాగేది లేదని నిర్ణయించుకొంటాను. 19 ఏళ్ల వయసులోనే నాకు పంజాబీ సినిమాలో ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడు క్రికెట్‌తో బిజీ. అందుకే ఒప్పుకోలేదు. ఇప్పుడు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాను. చాలా ఖాళీగా ఉన్నాను. అందుకే కొత్తగా ఏదైనా ఎందుకు ట్రై చేయవద్దు అని సినిమాను ఒప్పుకొన్నాను అని హర్బజన్ పేర్కొన్నారు.

    English summary
    Cricketer Harbhajan Singh debut into Kollywood with Friendship movie. Bhajji said, He was not serious about acting career. But I will decide after fate of Friendship movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X