ఒకేసారి రెండు హిట్లు-పిల్ల జమీందార్ పిల్లకు డబుల్ ధమాకా..!
పిల్లజమీందార్ లవర్ గా గుర్తుండిపోయే పాత్రలో నటించిన హరిప్రియాకు ఇప్పుడు డబుల్ బొనాంజా తగిలింది. తెలుగులో పిల్లజమీందార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుండగానే... తమిళ్ లో నటించిన సినిమా సైతం హిట్టవ్వడంతో... ప్రియ ఆనందానికి అవధుల్లేవట. ఈ డబుల్ హిట్స్ తో మరిన్ని ఆఫర్స్ కొట్టేయడం ఖాయంగా అనిపిస్తోంది.
భూమిక నిర్మించిన తకిట తకిట చిత్రంలో పరిచయమైంది హీరోయిన్ హరిప్రియ. ఈసినిమా.. విజయం సాధించకపోవడంతో... హరిప్రియాకు సరైన గుర్తింపు దక్కలేదు. అయితే... హీరోగా వెలుగొందుతున్న నానీతో జోడీ కట్టే అవకాశం పిల్ల జమీందార్ సినిమాతో దక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో... హరిప్రియాకు మంచి గుర్తింపు లభించింది. తన పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.
అయితే ఈ చిత్ర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుండగానే... మరో సూపర్ హిట్ ఈ ముద్దుగుమ్మ ఖాతాలో చేరింది. తమిళంలో రజన్ మాధవ్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేరన్ నిర్మించిన 'మురన్' కూడా హిట్టవడంతో హరిప్రియ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ సినిమాలో ఆమె చేరన్ ప్రియరాలి పాత్రను బాగా చేసిందనే పేరు కూడా సంపాదించింది. ఇలా రెండు భాషల్లో వెంటవెంటనే రెండు సినిమాలు విజయం సాధించడంతో హరిప్రియను మరిన్ని మంచి ఆఫర్స్ వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు..


Click it and Unblock the Notifications











