ప్రియురాలితో తెలుగు విలన్ హరీష్ ఉత్తమన్ రహస్య వివాహం, ఫోటోస్ లీక్
సౌత్ యాక్టర్ హరీష్ ఉత్తమన్ తన ప్రియురాలు అమృత కళ్యాణ్‌పూర్‌ను పెళ్లాడారు. నవంబర్ మొదటి వారంలోనే వీరి వివాహం రహస్యంగా కేవలం కొంత మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో పాటు సోషల్ మీడియాలో ఫోటోస్ లీక్ అయ్యాయి.
కేరళలోని గురువాయూర్ టెంపుల్‌లో నవంబర్ 6న వీరి వివాహం సింపుల్‌గా జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి ప్రైవేట్ ఈవెంటుగా జరిగిన ఈ వేడుకకు హరీష్, అమృత కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

వైరల్ అవుతున్న ఫోటోస్
హరీష్ ఉత్తమన్ పెళ్లి ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమృత కళ్యాణ్‌పూర్, హరీష్ మధ్య కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తోంది.

పెద్దల అంగీకారంతో వివాహం
ఇరుకుంటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల వివాహం మీడియాకు తెలియకుండా రహస్యంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి గురించి త్వరలోనే ప్రకటన
అయితే తన పెళ్లి విషయాన్ని హరీష్ ఇప్పటి వరకు అఫీషియల్‌గా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన వివిధ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారని సన్నిహితులు అంటున్నారు.

సినిమా రంగంలోకి
హరీష్ ఉత్తమన్ సినిమాల్లోకి రాకముందు పారమౌంట్ ఎయిర్ వేస్, బ్రిటిష్ ఏయిర్ వేస్‌లో క్యాబిన్ క్రూ జాబ్ చేశారు. తర్వాత చెన్నైలో కూడా కొన్ని ఉద్యోగాలు చేశారు. 2010లో ‘థా' అనే తమిళ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

తెలుగులో చేసిన సినిమాలు
తెలుగులో గౌరవం, పవర్, జిల్, పండగ చేస్కో, శ్రీమంతుడు, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణ గాడి వీర ప్రేమగాధ, మిస్టర్, దువ్వాడ జగన్నాధమ్, జై లవ కుశ, నా పేరు సూర్య చిత్రాల్లో హరీష్ ఉత్తమన్ నటించారు.


Click it and Unblock the Notifications











