రజనీకాంత్ సినిమాకు అనుమతి నిరాకరణ?
మైసూర్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 'లింగా' చిత్రం అక్షయ తృతీయను పురస్కరించుకుని శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ మైసూరు ప్యాలసులో జరుపాలని నిర్ణయించారు. అయితే సరైన అనుమతులు తీసుకోలేని కారణంగా అధికారులు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది.
మైసూరు ప్యాలసులో సినిమా షూటింగులు జరుపాలంటే ముందుగా మైసూరు మహారాజ అనుమతి తీసుకోవాలని తెలుస్తోంది. అయితే 'లింగా' చిత్ర యూనిట్ సభ్యులు అలాంటి అనుమతులు తీసుకోక పోవడంతో అధికారులు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. మైసూరు ప్యాలసులో షూటింగ్ అనంతరం 'లింగా' చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగనుంది.

కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న 'లింగా' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మాస్తున్నారు. రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క షెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు ముఖ్యమైన పాత్ర పోషించనున్నారు. రెండుసార్లు ఆస్కార్ అవార్డు సాధించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రహ్మాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
ఈ వయసులోనూ హీరోగా ఇరగదీస్తున్న తమిళ స్టార్ హీరో రజనీకాంత్ మరో సంచలన చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికీ ఆయనలో ఎనర్జీ లెవల్స్ ఓ రేంజిలో ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కెఎస్ రవి కుమార్, రజనీకాంత్ కాంబినేసన్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. గతంలో రజనీ నటించిన ముత్తు, నరసింహ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన కెఎస్ రవికుమార్...'కొచ్చాడయాన్'చిత్రానికి స్టోరీ కూడా సమకూర్చారు.


Click it and Unblock the Notifications











