»   » మరో భక్తుడితోనూ రంజిత రాసలీలలు?

మరో భక్తుడితోనూ రంజిత రాసలీలలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిత్యానంద స్వామికి భక్తుడిగా ఆశ్రమంలో ఉంటూ ఆయన కారు నడిపిన లెనిన్ చెన్నై పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. గతంలో అనేక నేరాలతో సంబంధమున్న లెనిన్ వాటి నుంచి తప్పించుకోడానికే బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమానికి చేరినట్టు పోలీసుల పరిశోధనలో వెల్లడైంది. చెన్నై పోలీసుల అనుగ్రహం పొందడానికి అతను నిత్యానంద స్వామి అనేక మంది హీరోయిన్లతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తూ చిక్కిన వీడియో సిడిలను లెనిన్ చెన్నై పోలీసు ఉన్నతాధికారులకు అందించినట్టు తెలుస్తోంది.

రంజితతో స్వామి సెక్స్ చేస్తుండగా తీసిన వీడియో వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు చెన్నై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో వారికి కొన్ని క్లూలు లభించాయట. స్వామి గదిలోకి వెళ్ళే ముందు రంజిత లెనిన్ కు చెప్పి తన మొహం పడకుండా స్వామి మొహం స్పష్టంగా కన్పించేలా వీడియో తీయమని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ కొన్ని సన్నివేశాల్లో ఆమె మొహం కన్పించింది. అమె, లెనిన్ కుమ్మక్కై స్వామీజీని బ్లాక్ మెయిల్ చేయడానికే ఈ పనికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu