రాబోయే ‘యముడు’కి పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రశంసల వెల్లువ...!?
ఓ డబ్బింగ్ సినిమాను రికార్డు ప్రింట్లతో విడుదల చేస్తున్నారిప్పుడు. ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేసినంత హడావుడి చేస్తోన్న ఆ సినిమా యముడు. సూర్య, అనుష్క జంటగా తమిళంలో నటించిన సింగం ఇప్పుడు తెలుగు లో యముడుగా ముందుకు వస్తోంది. తన కెరీర్ లో అత్యుత్తమ కలెక్షన్స్ ను ఈ చిత్రం తమిళంలో వసూలు చేసిందని హీరో సూర్య అంటున్నాడు. తనకు ఇది 25వ చిత్రం అని చెప్పిన సూర్య తమిళంలో 550పైగా ప్రింట్లతో విడుదలయిందని అలాగే తెలుగులో కూడా ఎక్కువ ప్రింట్లతోనే రిలీజవుతోందని చెప్పాడు.
ఈ చిత్రం కథ ప్రకారం పోలీస్ జాబ్ అంటే ఇష్టం లేని దొరై సింగం(సూర్య) తన తండ్రి మాటకోసం ఓ సబ్ ఇన్సెపెక్టర్ గా మారతాడు. నిజాయితీగా బతకాలనుకున్న ఓ పోలీసు జీవితం పల్లె నుంచి వచ్చిన అతను నీతికి,నిజాయితీకి మారు పేరుగా ఉంటాడు అని చెప్పిన సూర్య తమిళనాడు పోలీస్ డిపార్ట్ మెంట్ అంతా ఈ సినిమాని ప్రశంసించడం మరచిపోలేను.." అంటున్నాడు.
అమలాపురం సరోజగా తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అనుష్క ఈ చిత్రంలో కొత్త అనుష్కను చూస్తారని చెబుతున్నారు. నాజర్ కూతురుగా అనూష్క...టౌన్ ఫిల్ల..పల్లె వాడైన హీరో ప్రేమలో పడుతుంది. వివేక్ కామిడీ మరో ప్రక్క, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వీటికి తోడై ధియోటర్ ని వేడిక్కిస్తుంది. ఇవన్నీ కలిసిన సింగం తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొత్తానికి ఒక కమర్షియల్ సినిమాని ఇంత లాజికల్ గా , ఇంత చక్కని పాటలతో తీయగలిగారంటే, ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ హరికే చెందుతుంది. ఎక్కడా డబ్బింగ్ సినిమా అనిపించకోదు. సూర్య ఎంతటి ఘటికుడో మనుకు తెలుసు. ఈ సినిమాతో మరోసారి రుజువ్వనుంది. ఆ చిత్రం ఇప్పుడు తెలుగులో అన్ని రకాల ప్రేక్షకులను అలరించడానికి 'యముడు" పేరుతో డబ్బింగై. జులై 2న రిలీజవుతోంది.


Click it and Unblock the Notifications











