నా కళ్ల ముందే నీచంగా.. వైరముత్తుపై మరో లైంగిక పిడుగు.. గాయకుడి భార్య..
కొద్దిరోజులుగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ రచయిత వైరముత్తుపై మరో పిడుగుపడింది. తనను లైంగికంగా వేధించాడని గాయని చిన్మయి ఆరోపణలు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చిన్మయి ఆరోపణలు సంచలనం రేపుతుండగానే మరో గాయకుడు యుగేంద్రన్ భార్య హేమా మాలిని లైంగిక వేధింపుల ప్రస్తావన తీసుకురావడం వైరముత్తును మరోసారి ఇబ్బందుల్లో పడేసింది. హేమా మాలిని తన ఫేస్‌బుక్ అకౌంట్లో వైరముత్తు వేధింపుల గురించి వివరంగా పోస్ట్ చేశారు.

పది సంవత్సరాల నుంచి
గతంలో నేను ప్రముఖ తమిళ టెలివిజన్ సోని మ్యూజిక్ ఛానెల్‌లో పనిచేసే దానిని. ఆ సందర్భంగా వైరముత్తు ఓ యాంకర్‌ను వేధించేవాడు. నా కళ్ల ముందే చాలా మంది యాంకర్లతో దారుణంగా ప్రవర్తించేవాడు. గత పదేళ్లలో చాలా వేదికలపై వైరముత్తు ప్రవర్తన గురించి ఎన్నోసార్లు చెప్పినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులనే ప్రశ్నిస్తారా?
వైరముత్తు దారుణాలను బయటపెట్టిన గాయని చిన్మయికి నా సెల్యూట్. ఆమె ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడంతోనే ఆయన ఆగడాలకు బయటపడ్డాయి. ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలపై చర్చ జరుగాల్సిన అవసరం ఏర్పడింది. బాధితులనే ప్రశ్నించే పరిస్థితి రావడం ఇంకా దారుణంగా ఉంది అని హేమామాలిని అన్నారు.
ఎంత వరకు సబబు?
వైరముత్తు దారుణాలను బయటపట్టిన చిన్మయికి తమిళ పరిశ్రమ నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడం శోచనీయం. సపోర్ట్ తెలుపకపోయినా.. పదేళ్లుగా ఎందుకు మాట్లాడలేదని చిన్మయిని ప్రశ్నించడం ఎంత వరకు సబబు. వైరముత్తును ఎందుకు నిలదీయడం లేదు. దాడి చేసిన వాడిని వదిలిపెట్టి బాధితులనే ఈ సమాజం ఎందుకు ప్రశ్నిస్తున్నది అని హేమా మాలిని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతా అవాస్తవమే
తనపై వస్తున్న లైంగిక దాడి ఆరోపణలను రచయిత వైరముత్తు ఖండించారు. పలువురు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు అని అన్నారు. ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు. చట్టపరమైన తీర్పు వచ్చే వరకు సహనం పాటించండి అంటూ వైరముత్తు రిక్వెస్ట్ చేశారు.

అర్జున్ సర్జాపై లైంగిక ఆరోపణలు
తమిళ చిత్ర పరిశ్రమలో పలువురు సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు రావడం సంచలనాలకు వేదికగా మారుతున్నాయి. వైరముత్తుపైనే కాకుండా సుశీ గణేషన్, అర్జున్ సర్జా, రాధారవి లాంటి ప్రముఖుల పేర్లు బయటకు రావడం సెన్సేషనగా మారింది.


Click it and Unblock the Notifications











