HBD Thalapathy Vijay విజయ్ రిజెక్ట్ చేసిన సినిమాలతో.. ఎంత మంది స్టార్స్ అయ్యారో తెలుసా?

తమిళ తంబీలు దళపతి అని ప్రేమగా పిలుచుకునే స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు నేడు. ప్రస్తుతం ఆయన ఇండియన్ సినిమాలోనే అత్యధిక పారితోషకం అందుకునే స్టార్స్ లో ఒకరు. దాదాపు 150 కోట్ల భారీ పారితోషికం అందుకుంటున్న విజయ్ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలను వదులుకున్నారు కూడా. ఈరోజు విజయ్ బర్త్ డే సందర్భంగా ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటి? దానివల్ల ఎంతమంది నటులు స్టార్ హీరోలు అయ్యారు? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

1. పందెంకోడి
2005లో రిలీజ్ అయిన పందెంకోడి సినిమా తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముందుగా ఈ మూవీని విజయ్ సేతుపతికి వివరించగా ఆయన ఫస్ట్ హాఫ్ కూడా వినకుండానే రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ మూవీ విశాల్ దగ్గరకు వెళ్లడం, ఆయన కెరీర్ ను మలుపు తిప్పే హిట్ అయ్యింది.

HBD Thalapathy Vijay Do you Homw many heroes become stars when Movies list rejected by Vijay

2. ధూల్
ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించాడు. అయితే ముందుగా ధూల్ డైరెక్టర్ ధరణి విజయ్ కే స్టోరీని చెప్పారట. కానీ స్క్రిప్ట్ లో అంత పట్టులేదని ఫీలైన విజయ్ రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత ఈ మూవీ విక్రమ్ దగ్గరకు వెళ్ళింది. విక్రమ్, జ్యోతిక జంటగా నటించిన ఈ మూవీ కూడా హిట్ అయింది.

3. ఒకే ఒక్కడు
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 1999లో రిలీజ్ అయిన ఒకే ఒక్కడు మూవీ హిస్టరీని తిరగరాసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అర్జున్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ముందుగా శంకర్ ఈ మూవీ స్టోరీతో విజయ దగ్గరకు వెళ్లారట. కానీ ఆ టైంలో విజయ్ రాజకీయాలతో ముడిపడి ఉన్న సినిమాలు చేయను అని చెప్పడంతో ఈ అద్భుతమైన ఛాన్స్ అర్జున్ ను వరించింది.

4.. ధీనా
మురగదాస్ దర్శకత్వంలో 2001లో రిలీజ్ అయిన మూవీ ధీనా. ఈ మూవీని కూడా విజయ్ రిజెక్ట్ చేయడంతో అజిత్ దగ్గరకు వెళ్లడం, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది.

HBD Thalapathy Vijay Do you Homw many heroes become stars when Movies list rejected by Vijay

5. ఆటోగ్రాఫ్
2004లో డైరెక్టర్ చరణ్ హీరోగా రూపొందిన మూవీ ఆటోగ్రాఫ్. రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ పేరుతో ఈ మూవీనే రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. అయితే తమిళ భాషలో మాత్రం డైరెక్టర్ విజయ్ కి ముందుగా స్టోరీని విన్పించగా, ఆయన పక్కన పెట్టేసారట. దీంతో డైరెక్టర్ హీరోగా మారి సినిమా తీసి హిట్టు కొట్టి చూపించాడు.

6. సింగం
సూర్యను పవర్ ఫుల్ నటుడిగా మార్చింది సింగం ఫ్రాంచైజీ. 2010లో రిలీజ్ అయిన సింగం మూవీతో పాటు మరో రెండు పార్ట్స్ కూడా తెలుగుతోపాటు హిందీలో రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. సూర్యను తమిళంలోని స్టార్ హీరోల జాబితాలో చేర్చాయి. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీని ముందుగా విజయ్ కోసమే అనుకున్నప్పటికీ, ఆయన వదులుకోవడంతో సూర్య చెంతకు చేరింది. మొత్తానికి ఇలా విజయ్ రిజెక్ట్ చేసిన సినిమాలతో సూర్య, అర్జున్, విక్రమ్, విశాల్, అజిత్ లు సూపర్ స్టార్లు అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X