HBD Thalapathy Vijay చరిత్ర సృష్టించిన విజయ్ ఫ్యాన్స్.. పుట్టిన రోజున అరుదైన రికార్డు

కోలీవుడ్ సూపర్‌స్టార్ విజయ్ జన్మదినం రోజున అభిమానులు హంగామా అంతా ఇంతా కాదు. తన అభిమాన కథా నాయకుడి పుట్టిన రోజున సోషల్ మీడియాలో సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా రికార్డు నమోదు చేసి చరిత్ర సృష్టించారు. విజయ్ ఫ్యాన్స్ చేసిన రికార్డు వివారాల్లోకి వెళితే...

ఇళయ దళపతి విజయ్ తన 47వ పుట్టిన రోజును జూన్ 22వ తేదీన ఘనంగా జరుపుకొన్నారు. తమ హీరో పుట్టిన రోజుకు ముందు రోజున అభిమానులు ట్విట్టర్‌లో స్పేస్ సెషన్ నిర్వహించారు. దీనిలో అభిమానులు, సెలబ్రిటీలు, నటీనటులు, టెక్నిషియన్లు, డైరెక్టర్లు, జర్నలిస్టులు పాలుపంచుకొన్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్ స్పేస్‌లో ఈ రేంజ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి అని చెప్పుకొంటున్నారు.

 HBD Thalapathy: Vijay fans creates record in Twitter space session

విజయ్ బర్త్ డే సందర్భంగా ఇండియన్ ట్విట్టర్‌లో నిర్వహించిన స్పేస్ సెషన్‌లో దాదాపు 27971 మంది యూజర్లు పాల్గొన్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా యూజర్లు పాల్గొన్న సెషన్‌గా రికార్డుకెక్కింది. ఇటీవల జగమే తంత్రం రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ట్విట్టర్ సెషన్స్‌లో దాదాపు ఇంతకంటే తక్కువ మంది పాల్గొన్నారు. కొరియన్ సింగర్ బామ్ బామ్ నిర్వహించిన సెషన్స్‌లో 44208 మంది పాల్గొన్నారు. ఓవరాల్‌గా ఇదే ఇప్పటికి హయ్యెస్ట్. ఇండియాలో విజయ్ బర్త్ డే సందర్భంగా నిర్వహించిన సెషన్స్ మాత్రమే రికార్డుగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X