ఫైనల్ గా అంజలి కేసు అలా ముగిసింది
అంజలి షూటింగుల్లో బిజీగా ఉంటున్నందున కాస్త సమయం ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ నేపథ్యంలో.. మంగళవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వచ్చింది. అంజలి హైదరాబాద్‌లో పోలీసుల ముందు హాజరైందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని, షూటింగుల్లో పాల్గొంటోందని ఆమె న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి.. 'మీకు అభ్యంతరం లేకపోతే కేసు ఉపసంహరించుకోవచ్చు' అని భారతీదేవికి సూచించారు. ఇందుకు ఆమె అంగీకరించడంతో కేసు కొట్టేశారు.
ఇక 'సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు' విజయం సాధించంటంతో వరస ఆఫర్స్ తో బిజీ అయిన అంజలి ...ఇప్పుడు 'బలుపు' కూడా హిట్ బాటలో దూసుకుపోవటంతో ఫుల్ ఖుషీగా ఉంది. అందుకు తగినట్లుగా ఆమె ఇరవై లక్షలు దాకా రెమ్యునేషన్ పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
'బలుపు' లో ఆమె ఫ్లాష్ బ్యాక్ లో కనపడే డాక్టర్ పాత్రలో కనిపించింది. ఆ లవ్ స్టోరీనే సినిమాకు కీలకం. రవితేజ నటించిన 'బలుపు' చిత్రం రెండు వారాల క్రితం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న రవితేజకు ఈ చిత్రం ఊరటనిచ్చిందనే చెప్పాలి. రవితేజ అభిమానులు కూడా చాలా కాలం తర్వాత తాము కోరుకుంటున్నట్లుగా రవితేజను తెరపై చూసి హ్యాపీగా ఫీలయ్యారు.


Click it and Unblock the Notifications












