twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ మతాన్ని కించపరచే సీన్స్ లేవు

    By Srikanya
    |

    చెన్నై: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రం 'మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌'. గుర్మిత్‌రామ్‌ రహీం సింగ్‌ ఇందులో కీలకపాత్ర పోషించారు. సంగీతంతోపాటు దర్శకత్వం కూడా ఆయన వహించారు. సెన్సార్‌బోర్డులో అధికారుల రాజీనామాకు కూడా దారి తీసిన ఈ చిత్రం పలు సమస్యలను దాటుకుని విడుదలకు సిద్ధమవుతోంది.

    ఈ చిత్రంలో సిక్కులను కించపరుస్తూ.. కొన్ని సన్నివేశాలను తెరకెక్కించినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో పంజాబ్‌, హర్యానాలో ఈ సినిమాను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని కోరుతూ కొన్ని వర్గాలు కోర్టుల్లో వ్యాజ్యం దాఖలు చేశాయి. చివరకు ఈ అంశం అత్యున్నత న్యాయస్థానానికి చేరింది.

    HC to hear plea against movie Messenger of God

    గుర్మిత్‌రామ్‌ రహీంసింగ్‌ మాట్లాడుతూ.. ఇందులో చర్చనీయాంశమైన అంశాలేవీ లేవు. ప్రధానంగా యువతను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో మతాలను కించపరిచేందుకు అవకాశాలు లేవు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ చిత్రాన్ని చూసింది.

    కొన్ని సన్నివేశాలను తొలగించి విడుదలకు మార్గం సుగమం చేసింది. తొలగించిన సన్నివేశాల వల్ల మేం చెప్పదలచుకున్న విషయాన్ని ఎలాంటి ఆటంకం కలగలేదు. ప్రపంచవ్యాప్తంగా వీలైనంత త్వరలో ఈ సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.

    English summary
    A petition seeking directions to ban the screening of movie, "Messenger of God" (MSG) in the states of Punjab and Haryana was filed before the Punjab and Haryana high court on Wednesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X