twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజ్ ఆపాలంటూ హైకోర్టుకి...తల పట్టుకున్న నిర్మాత

    By Srikanya
    |

    చెన్నై : తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వడివేలు నటనలో రూపుదిద్దుకున్న తెనాలిరామన్‌ చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ తెలుగు సంఘాల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. అఖిల భారత తెలుగు ప్రజల సమాఖ్య అధ్యక్షులు సీఎంకే రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, తమిళనాడు తెలుగు ప్రజల సమాఖ్య అధ్యక్షుడు బాలగురుస్వామి మద్రాసు హైకోర్టులో ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు.

    ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ 'తెనాలిరామన్‌' అనే తమిళ సినిమాను రూపొందించిందని తెలిపారు. హాస్యనటుడు వడివేలు నటనలో చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలును అవమానించే విధంగా సన్నివేశాలను చిత్రీకరించారని పేర్కొన్నారు. తెనాలిరామన్‌లో కృష్ణదేవరాయలు పాత్రలేదని ఆ చిత్ర దర్శకులు యువరాజ్‌ దయాళన్‌ పేర్కొంటున్నారని చెప్పారు. అయితే సినిమా ట్రైలర్‌లో కృష్ణదేవరాయలును కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నట్లు వివరించారు. ఒకవేళ అలాంటి పాత్ర చోటుచేసుకోని నేపథ్యంలో సినిమా పేరును మార్చాలని కోరారు. ఈ సినిమాను ఈ నెల 18వ తేదీ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, దీన్ని ఆపాలంటూ కోరారు.

    HC moved against Vadivelu's comeback film 'Tenaliraman'

    ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి సతీష్‌కుమార్‌ అగ్నిహోత్రి, న్యాయమూర్తి సుందరేష్‌ కలిగిన బెంచ్‌ సమక్షంలో విచారణ జరిగింది. తెనాలిరామన్‌ తమిళంలో రూపుదిద్దుకోవడంతో చిత్ర కథ, సంభాషణ వ్యవహారాలపై తాను పరిశీలించడం కుదరదన్నారు. కాగా ఈ కేసును మూడో డివిజన్‌ బెంచ్‌ విచారణకు న్యాయమూర్తి ఆదేశించారు.

    తెలుగు సంఘాల ఆరోపణల్లో వాస్తవం లేదని, నటుడు వడివేలును నిందిస్తే ఉపేక్షించేదిలేదని నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ చేసిన వ్యాఖ్యలకు తెలుగు సంఘాల ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీన్ని నిరసిస్తూ, ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 15న చెన్నై వళ్లువర్‌కోట్టంతో పాటు ఆయా జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట ఆందోళనలు నిర్వహించనున్నట్లు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇందులో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొని తమ గళం వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

    '23మ్‌ పులికేసి' వంటి చరిత్రాత్మక కథలో నటించి.. రెండు భిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను వడివేలు కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే . గత కొంతకాలంగా తెరకు దూరమైన ఆయన ప్రస్తుతం సరికొత్తగా మళ్లీ తెరపైకి వస్తున్నారు. 'జగజ్జాల భుజబల తెనాలిరామన్‌' చిత్రంలో ఆయన శ్రీకృష్ణ దేవరాయులు, తెనాలిరాముడి పాత్రలను పోషిస్తున్నారు. యువరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రూ.25 కోట్లతో తెరకెక్కిస్తోంది.

    దర్శకుడు మాట్లాడుతూ.. '' వడివేలు స్థాయికి తగిన చిత్రమిది. '23మ్‌ పులికేసి' మాదిరిగా మంచి విజయం సాధిస్తుంది. వడివేలు రీఎంట్రీ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మీనాక్షి దీక్షిత్‌ వడివేలు సరసన నటిస్తోంది. శివాజీ నటించిన తెనాలిరామన్‌కు దీనికి ఏమాత్రం సంబంధం లేదు''అని చెప్పారు.

    English summary
    A petition has been filed in Madras High Court seeking to restrain the screening of popular Tamil comedian Vadivelu's comeback film "Tenaliraman" on the ground that it might have portrayed emperor Krishnadevaraya in a ridiculous manner hurting the sentiments of Telugu people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X