ఇళయదళపతి విజయ్‌ని పట్టించుకోని హీరోయిన్.. ఫోన్ చూసుకుంటూ పరధ్యానంగా.. ఏం జరిగిందంటే!
Recommended Video
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కైఫ్ తన కెరీర్ ఆరంభంలో సౌత్ లో నటించింది. మల్లీశ్వరి, అల్లరి పిడుగు లాంటి తెలుగు చిత్రాల్లో కత్రినా కైఫ్ నటించిన సంగతి తెలిసిందే. సౌత్ లో మరో క్రేజీ హారో ఇళయదళపతి విజయ్ తో కలసి కొన్నేళ్ల క్రితం కత్రినా కైఫ్ ఓ యాడ్ షూట్ లో పాల్గొంది. అప్పటి సంగతులని కత్రినా కైఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. హీరో విజయ్ ప్రవర్తన ఎలాంటి వారి మనసునైనా దోచేస్తుందని కత్రినా కైఫ్ ప్రశంసించింది. కొన్నేళ్ల క్రితం తామిద్దరం ఊటీలో ఓ యాడ్ షూట్ పాల్గొన్నామని, అక్కడ ఆసక్తికర సంఘటన జరిగిందంటూ కత్రినా వెల్లడించింది.

వాణిజ్య ప్రకటనలో
కొన్నేళ్ల క్రితం జరిగిన వాణిజ్య ప్రకటన షూటింగ్ లో హీరో విజయ్ ని కలుసుకున్నా. ఆయన షూటింగ్ లో అందరిని పలకరించే విధానం, మర్యాద మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయానని కత్రినా కైఫ్ తెలిపింది. విజయ్, కత్రినా కైఫ్ కోకోకోలా యాడ్ లో నటించారు. అది కత్రినా కైఫ్ కెరీర్ ప్రారంభ దశ. ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్ లో ఎలాంటి క్రేజీ హీరోయినో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఫోన్ చూసుకుంటూ
ఊటీలో షూటింగ్ ముగిసిన తర్వాత మేమంతా ప్లోర్ పైనే కూర్చుని ఉన్నాం. నాకు బాగా చలిగా అనిపిస్తోంది. చేతిలో ఉన్న ఫోన్ చూసుకుంటూ ఉన్నా. ఇంతలో నా ముందు రెండు కాళ్ళు కనిపించాయి. ఎవరో నిల్చుని ఉన్నారని తల పైకి ఎత్తి చూడలేదు. కాసేపటి తర్వాత కూడా ఆ కాళ్ళు అలాగే కనిపించాయి. చివరకు నా ముందు నిల్చుని ఉంది ఎవరా అని గమనిస్తే అది విజయ్ అని కత్రినా కైఫ్ తెలిపింది.

పట్టించుకోకపోయినా
నేను ఫోన్ చూసుకుంటూ పట్టించుకోకపోయినా విజయ్ నా కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. షూటింగ్ ముగియడంతో నాకు గుడ్ బై చెప్పడానికి వచ్చారు. నేను ఫోన్ చూసుకుంటుండడంతో డిస్టర్బ్ చేయకూడదని విజయ్ నా కోసం ఎదురుచూసినట్లు కత్రినా కైఫ్ తెలిపింది. విజయ్ లాంటి స్టార్ హీరో నా కోసం అంత వినయంగా ఎదురుచూడడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని కత్రినా పేర్కొంది.

తిరుగులేని హీరో
ఇటీవల కాలంలో విజయ్ తమిళంలో తిరుగులేని హీరోగా మారిపోయాడు. విజయ్ నటించే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక అభిమానుల్లో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కత్రినా కైఫ్ కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కత్రినా ఇప్పటికీ బాలీవుడ్ లో సల్మాన్, అమీర్, షారుఖ్ లాంటి క్రేజీ హీరోలతో సినిమాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











