Ajith Kumar అజిత్ లేటెస్ట్ హెల్త్ అప్డేట్.. ఆరోగ్య సమస్యపై సంచలన విషయాలు బయటకు!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆసుపత్రిలో చేరారు. ఆయనపై నిన్నటి నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. కొందరైతే చావు బతుకుల మధ్య స్టార్ హీరో అంటూ వార్తలు రాసేస్తున్నారు. అయితే అజిత్ కుమార్ ఆసుపత్రిలో ఎందుకు చేరారు.. అసలు ఆయనకు ఏం సమస్యలు ఉన్నాయి.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనే వాటిపై ఫిల్మిబీట్.. హీరో పీఆర్ఓను సంప్రదించింది. ఆయన అజిత్ కుమార్ ఆరోగ్యంపై సంచలన విషయాలు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే....
స్టార్ హీరో అజిత్ కుమార్ తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఆయన సినిమాలు దాదాపు అన్ని తెలుగులో డబ్ అవుతూ ఉంటాయి. ఇక ఆయనకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రియురాలి పిలిచింది, వాలి వంటి చిత్రాలతో అప్పట్లోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక శామిలిని పెళ్లాడిన తర్వాత ఫ్యామిలీ మరోవైపు సినిమాలతో బిజీగా మారిపోయారు. ఇదిలా ఉంటే ఆయన తాజాగా ఆసుపత్రిలో చేరారు.

ఇక అజిత్ ఆరోగ్యంపై రోజుకో వార్త బయటకు వస్తుంది. ఆయనకు బ్రెయిన్ సమస్య, సర్జరీ అంటూ వార్తలు పుట్టుకువచ్చాయి. కొంత మంది దారుణంగా అజిత్ చావు బతుకుల మధ్య ఉన్నట్లు రాసుకువచ్చారు. అయితే వీటిపై ఫిల్మిబీట్.. అజిత్ కుమార్ మేనేజర్ ను సంప్రదించింది. దీంతో ఆయన పూర్తి వివరాలు తెలియజేశారు. అజిత్ ఆరోగ్యంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
అసలు విషయం ఏంటంటే... అజిత్ కుమార్ అనారోగ్యం గురించి వస్తున్న రూమర్స్ అన్నింటినీ ఆయన పీఆర్ఓ టీమ్ ఖండించింది. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పుకువచ్చారు. అయితే రెగ్యూలర్ చెకప్ తీసుకున్న మాట నిజమేనని వెల్లడించారు. అజిత్ చెవి మరియు మెదడు మధ్య నరాల వాపుతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అజిత్ పీఆర్ఓనే తెలిపారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న అజిత్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. రేపు ఉదయానికి అజిత్ డిశ్చార్జ్ అవుతాడని వెల్లడించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. అజిత్ కు ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. దానికి తోడు మీడియాలో వస్తున్న వార్తలను చూసి భయాందోళనకు గురయ్యారు.

అజిత్ సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం 'విడాముయార్చి' అనే మూవీలో నటిస్తున్నారు. ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మాగిజ్ తిరుమేని ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా.. లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది.
'విడాముయర్చి' ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో అజిత్ సరసన కోలీవుడ్ బ్యూటీ త్రిష హీరోయిన్గా నటిస్తుండగా.. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు 6 సినిమాలు వచ్చాయి. మళ్లీ 9ఏళ్ల తర్వాత వీరు విదా మూయార్చిలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











