పెళ్లి పత్రికలు సిద్ధం.. హైదరాబాద్‌లో పెళ్లి.. వెడ్డింగ్ కార్డు షేర్ చేసిన విశాల్

బాలీవుడ్‌లో మాదిరిగానే తమిళ చిత్ర పరిశ్రమలో పెళ్లి సీజన్ మొదలైంది. యువ హీరో, హీరోయిన్లు ఆర్య, సాయేషా పెళ్లికి సిద్దమవుతుండగా, అదే వరుసలో విశాల్‌ కూడా పెళ్లికి రెడీ అవుతున్నాడు. గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న ఆర్య, సాయేషా ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్య తన పెళ్లి ఆహ్వాన పత్రికలను పంచుతుండటం గమనార్హం. విశాల్‌ను తన పెళ్లికి ఆహ్వానిస్తూ వెడ్డింగ్ కార్డును ఇవ్వడం జరిగింది. వివరా్లోకి వెళితే..

మార్చి 9న ఆర్య పెళ్లి

మార్చి 9న ఆర్య పెళ్లి

సాయేషా, ఆర్య వివాహం మార్చి 9 లేదా 10వ తేదీన హైదరాబాద్‌లో జరుగనున్నది. అనంతరం చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. పెళ్లి నేపథ్యంలో
తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు ఆర్య తొలి పత్రికను అందజేశారు. విశాల్ ఇంటికి వెళ్లి అందజేసి సెల్ఫీ దిగారు.

నా హృదయానికి దగ్గరగా ఫొటో

ఆర్య వెడ్డింగ్ కార్డు ఇస్తున్న ఫోటోను విశాల్ సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. నా హృదయానికి చాలా దగ్గరగా ఉండే ఫొటో ఇది. నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్య వెడ్డింగ్ ఇన్విటేషన్ అందింది. చాలా ఆనందకరమైన క్షణాలను అనుభవించాను. ఆర్య, సాయేషా వైవాహిక జీవితం సుదీర్ఘంగా సాగాలను కోరుకొంటున్నాను అని విశాల్ తెలిపారు.

 గజనీకాంత్ సినిమా షూటింగ్‌లో

గజనీకాంత్ సినిమా షూటింగ్‌లో

ఆర్య, సాయేషా గజనీకాంత్ అనే సినిమా షూటింగ్‌లో చాలా దగ్గరయ్యారు. ఆ తర్వాత పీకల్లోతు ప్రేమలోపడ్డారు. ఇరు కుటుంబా సమ్మతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. తమ పెళ్లి నిశ్చితార్థం గురించిన వార్తను ప్రేమికుల రోజున వెల్లడించిన విషయం తెలిసిందే.

త్వరలోనే విశాల్ పెళ్లికి

త్వరలోనే విశాల్ పెళ్లికి

ఇదిలా ఉండగా, హీరో విశాల్ నిశ్చితార్థం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన అనిశా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరిగే అవకాశం ఉంది. తమిళ నిర్మాతల మండలి భవనం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకొంటానని చెప్పిన విశాల్ తన మాటను నిలబెట్టుకొన్నాడు. త్వరలోనే ఆ భవన నిర్మాణం పూర్తి కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X