For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోలీసులకు పట్టుబడ్డ హీరో జై.. ఏం జరిగిందంటే..

  By Rajababu
  |
  Tamil Hero Jai Apologizes To Chennai Police

  సిల్వర్ స్క్రీన్‌పై నీతులు మాట్లాడే హీరోలు నిజ జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. నిబంధనలు ఉల్లంఘిస్తే రీల్ లైఫ్‌లో ఉండే క్రేజ్ మొత్తం తుస్సుమనడం ఖాయం. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించిన తమిళ హీరో జై ప్రస్తుతం ఓ వివాదంలో ఇరుక్కొన్నారు. గతంలో శిక్షపడినా మళ్లీ అలాంటి తప్పే చేసి పోలీసులకు జై పట్టుబడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

  ఫుల్లుగా మద్యం సేవించి

  ఫుల్లుగా మద్యం సేవించి

  గతేడాది సెప్టెంబర్‌లో ఫుల్లుగా మద్యం సేవించిన తర్వాత కారు నడుపుతూ చెన్నైలోని శాస్త్రి నగర్ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు. ఆ కేసులో అతడికి జరిమానా విధించడమే కాకుండా ఆరు నెలలపాటు తన లైసెన్స్‌ను కోర్టు సస్సెండ్ చేసింది. ఇకనైనా మారుతాడనుకొంటే మరోసారి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు.

  నిబంధనలకు విరుద్దంగా

  నిబంధనలకు విరుద్దంగా

  తాజాగా చెన్నైలోని అడయార్ ప్రాంతంలో తన విలాసవంతమైన కారులో ప్రయాణిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పెద్దగా శబ్దం చేస్తూ వెళ్లడం కెమెరాల్లో రికార్డైంది. కారకు హై డిసిబుల్ సైలెన్సర్‌ను ఉపయోగించడం వల్ల చెవులు తూట్లు పడేలా శబ్దం వినిపించింది. ఈ న్యూసెన్స్ కారణమైన జై పోలీసులు విచారించారు.

   క్షమాపణలు కోరిన జై

  క్షమాపణలు కోరిన జై

  ట్రాఫిక్ పోలీసుల విచారణ సందర్భంగా తన తప్పును ఒప్పుకొని జై క్షమాపణలు కోరినట్టు సమాచారం. అలాగే తన కారుకు బిగించిన పరికరాన్ని కూడా తొలగిస్తానని మాట ఇచ్చాడట. ఇక ముందు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించనని అధికారులకు రాతపూర్వకమైన పత్రాన్ని సమర్పించినట్టు తెలిసింది.

  పలుమార్లు జరిమానా చెల్లింపు

  పలుమార్లు జరిమానా చెల్లింపు

  గతంలో పలుమార్లు మితీమీరిన వేగంతో వాహనాన్ని నడపటం, అలాగే డ్రంక్ డ్రైవింగ్ కేసులో పట్టుబడటం జరిగింది. ఇలాంటి వ్యవహారాల్లో పలుమార్లు జరిమానాలు చెల్లించడం, కోర్టు మొట్టికాయలు వేయడం కూడా జరిగింది. అయితే తాజా ఘటన మరోసారి జై బాధ్యతారాహిత్యాన్ని తెలియజెప్పిందని అధికారులు పేర్కొన్నారు.

  హీరోయిన్ అంజలికి దూరంగా

  హీరోయిన్ అంజలికి దూరంగా

  గత కొద్దికాలంగా సినీ నటి అంజలితో అఫైర్ కొనసాగిస్తున్న జై ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఇటీవల అంజలి బర్త్ డే సందర్భంగా కూడా విషెస్ తెలియజేయకపోవడమనే అంశంపై మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.

  రిలీజ్‌కు సిద్దమైన జై సినిమాలు

  రిలీజ్‌కు సిద్దమైన జై సినిమాలు

  కలకలప్పు2 చిత్రం ఘనవిజయం సాధించడంతో హీరో జై మంచి జోష్‌లో ఉన్నారు. వెంకట్ ప్రభు పార్టీ చిత్రం, పిచ్చుమణి జరుగండి చిత్రాలను రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. నీయా2 అనే చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్నది.

  English summary
  Actor Jai was caught red-handed by Shastri Nagar traffic police for drunk driving last year in September. The actor was fined and his license was suspended for a period of six months by the Court. Recently, Jai was seen travelling in a luxury car in Adyar when the traffic police caught him again. This time, he had used a high decibel silencer in his car that causes much noise. The police had enquired him about violating traffic rules by causing a nuisance.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X