మతం మార్చుకున్న యంగ్ హీరో.. ఇంటి సభ్యుల రియాక్షన్ ఏంటంటే..?
జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో దగ్గరైన హీరో జై. అంజలికి భయపడే బాయ్ ఫ్రెండ్‌గా, అమాయకంగా కనిపిస్తూ నటించిన జైకి.. తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఆపై మళ్లీ చాలా కాలం పాటు తెలుగు తెరపై మెరవలేదు. మళ్లీ రాజారాణి చిత్రంలో నయన్ బాయ్ ఫ్రెండ్‌గా నటించి మార్కులు కొట్టేశాడు. ఇలా ఈ హీరో అడపాదడపా చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు.

అంజలితో ప్రేమాయణం..
అంజలితో కలసి చెట్టాపట్టాలేసుకున్న తిరిగిన ఈ యంగ్ హీరో మేమిద్దం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటున్నాడు. అయితే వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో నడుస్తున్న పుకారు కోలీవుడ్ మీడియాలో తరుచూ వినిపిస్తుంటుంది. తాజాగా మరో జై మరో ఆసక్తికర అంశంతో వార్తల్లో నిలిచాడు. ఈ యంగ్ హీరో మతం మార్చుకున్నట్టుగా వెల్లడించాడు.

వీరి వ్యవహారంతో..
వీరిద్దరి వ్యవహారంతో ఎంతగా నష్టపోయాడో ఓ నిర్మాత స్వయంగా వెల్లడించాడు. ఓ మూవీ షూటింగ్‌లో భాగంగా జై, అంజలికి వేర్వేరు గా రూములు బుక్ చేశామని తెలిపాడు.. కానీ వారిద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారన్నారు. సరే.. ఒక రూమ్ క్యాన్సిల్ చేస్తామంటే వద్దనే వారని.. ఈ కారణంగా రోజుకు రూ.12వేలు చొప్పున నష్ట పోయినట్లు చెప్పారు. ఒక రోజు షూట్ జరుగుతున్నప్పుడు మేడమ్ అని కాకుండా.. అంజలి అని పిలిచినందుకు నానా రచ్చ చేశాడని జై గురించి చెప్పుకొచ్చాడు.

మతం మార్చుకున్నట్లు ప్రకటన..
తన తాజా చిత్రం కేప్ మారి ప్రమోషన్ సందర్భంగా తాను మతం మార్చుకున్న విషయాన్ని వెల్లడించాడు జై. గత ఏడేళ్లుగా తాను ఇస్లాంను పాటిస్తున్నట్టుగా వెల్లడించాడు. అయితే ఇదే విషయాన్ని ఇంటి సభ్యులకు కూడా చెప్పినట్లు తెలిపాడు.

కుటుంబ సభ్యుల రియాక్షన్..
తాను ఇస్లాంను స్వీకరించిన విషయాన్ని ఇంట్లో చెప్పానని, తన నిర్ణయానికి కుటుంబ సభ్యులు కూడా మద్ధతు తెలిపారని అన్నాడు. ఏ దేవుడిని నమ్మకుండా ఉండే కన్నా ఏదో ఒక దేవుడిని నమ్మటం బెటర్ అని వాళ్లు భావిస్తునట్లు తెలిపాడు. త్వరలో జై తన పేరును అజీస్ జైగా మార్చుకోబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











