twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్భయ దోషులకు ఉరిశిక్ష.. మరి ఆ ఘటనకు ఇంకెప్పుడో.. ప్రశ్నించిన హీరో

    |

    దాదాపు ఎనిమిదేళ్ళ త‌ర్వాత నిర్భ‌యకు న్యాయం జరిగింది. అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన దోషుల‌కు నేడు ఉరిశిక్ష ప‌డింది. దీనిపై కొంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ, మ‌రికొంద‌రు విచారం వ్య‌క్తం చేస్తున్నారు. న్యాయం జరగడానికి ఇన్నేళ్లు సమయం పడుతుందా? అని కొందరు ఫైర్ అవుతుంటే.. ఇన్నాళ్లకైనా న్యాయం జరిగిందని కొందరు ట్వీట్ చేస్తున్నారు.

    సెలెబ్రిటీల స్పందన..

    నిర్బయ దోషులకు ఉరిశిక్ష పడటంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ ఉరిశిక్షపై సెలెబ్రిటీలు ట్వీట్స్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.అలాంటి వారికి ఇలాంటి శిక్షే సరైందని ముక్త కంఠంతో గొత్తెత్తున్నారు. అయితే ఈ ఘటనపై తమిళ హీరో కార్తీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

    ఎనిమిదేళ్లకు న్యాయం..

    ఎనిమిదేళ్లకు న్యాయం..

    తాజాగా త‌మిళ న‌టుడు కార్తీ.. నిర్భ‌య దోషులకు ఉరిశిక్ష పడటంపై స్పందించాడు. ‘8 సంవ‌త్స‌రాల త‌ర్వాత న్యాయం జ‌రిగింది. పొల్లాచి కేసులో న్యాయం జరగడానికి ఎంత సమయం పడుతుందో అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఒక సంవత్సరం అయ్యింది. ఈ ఘ‌ట‌న నుంచి మ‌నం చాలా నేర్చుకోవ‌ల‌సి ఉంద'ని ట్వీట్ చేశాడు.

    పొల్లాచ్చి కేసు..

    పొల్లాచ్చి కేసు..

    గ‌త ఏడాది పొల్లాచ్చికి చెందిన 16ఏళ్ల బాలికపై అత్యాచారం జ‌రిగిన విష‌యం తెలిసిందే . సాయంత్రం స‌మ‌యంలో తన చెల్లెలితో కలిసి దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండ‌గా, బైక్‌పై వచ్చిన ఓ యువకుడు వారిని అడ్డగించాడు. పదహారేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన పది మంది కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. రెండు రోజుల పాటు అమ్మాయికి నరకం చూపించిన రాక్షసులను కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే

    Recommended Video

    Donga Movie Team Interview || Karthi || Jyothika ||
    ఫామ్‌లో ఉన్న కార్తీ..

    ఫామ్‌లో ఉన్న కార్తీ..

    యంగ్ హీరో కార్తీ ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. ఖైదీ చిత్రంలో వంద కోట్ల హీరోగా మారిన కార్తీ.. దొంగతో మరో హిట్ కొట్టాడు. ఖైదీ అంత ప్రభావం చూపకపోయినా.. దొంగ ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ఖైదీ సీక్వెల్ కూడా త్వరలోనే రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

    English summary
    Hero Karthi About Pollachi Case. Finally justice for Nirbhaya after 8 years. Wondering how long it will take for the Pollachi case to find justice. It’s been a year already. Hope we don’t forget the lessons we learnt from it!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X