జ్యోతిక వల్ల సూర్య ఫ్యామిలీలో విభేదాలు.. అసలు నిజాలన్నీ బయటపెట్టిన కార్తి
తమిళ చిత్ర పరిశ్రమ నుంచి హీరోగా పరిచయమైనా.. దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోనే సూర్య. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న అతడు.. కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తున్నాడు. అలాగే, అతడి ఫ్యామిలీ నుంచి కార్తి, జ్యోతిక కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలా ఫ్యామిలీ అంతా సినీ రంగంలో సత్తా చాటుతోంటే.. వాళ్ల కుటుంబంలో విభేదాలు అంటూ తరచూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో కార్తి కొన్ని నమ్మలేని నిజాలు చెప్పాడు. అవి మీరే చూడండి!
ముంబైకు మకాం మార్చి
కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా వెలుగొందుతోన్న సూర్య తన తల్లిదండ్రులు శివకుమార్, లక్ష్మీతో పాటు సోదరుడు కార్తీతో కలిసి చెన్నైలోనే నివాసం ఉంటున్నాడు. ఉమ్మడి కుటుంబం అయినా వీళ్లంతా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అలాంటిది కొద్ది రోజుల క్రితమే స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి ముంబై నగరానికి మకాం మార్చేసిన విషయం తెలిసిందే.

70 కోట్లతో ఇల్లు కొన్నాడు
స్టార్ హీరో సూర్య ముంబై నగరానికి షిఫ్ట్ అవడంతో పాటు అక్కడ ఏకంగా రూ.70 కోట్లతో ఓ ఇల్లు కొనుగోలు చేశాడని, ఇకపై అక్కడే ఉండబోతున్నాడని కొద్ది నెలల క్రితమే న్యూస్ బయటకు వచ్చింది. తర్వాత సూర్య ముంబైలోని ఓ ఇంటి నుంచి బయటకు వచ్చి హోటళ్లకు వెళ్తున్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాళ్లు మకాం మార్చింది నిజమే అని తేలింది.
జ్యోతిక హిందీలో బిజీగా
సూర్య తన భార్య, పిల్లలతో కలిసి ముంబై నగరానికి వెళ్లిపోవడంపై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే, 'సూరరై పొట్రు' హిందీలో కూడా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతికలే నిర్మిస్తున్నారు. దీనికితోడు జ్యోతిక కూడా వరుసగా బాలీవుడ్‌లో సినిమాల మీద సినిమాలు చేస్తోంది. ఈ కారణంగానే వాళ్లు అక్కడకు వెళ్లిపోయారని మొదట్లో ప్రచారం జరిగింది.
కుటుంబంలో విభేదాలు
హీరో సూర్య ఫ్యామిలీ ముంబై వెళ్లడానికి మూవీలే కారణం అని మొదట టాక్ వచ్చినా.. ఆ తర్వాత మాత్రం కుటుంబంలో విభేదాలు రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తమిళ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు, అత్తమామలకు జ్యోతిక సినిమాలు చేయడం ఇష్టం లేదని, ఈ కారణంగానే ఆమె సూర్యతో వేరే కాపురం పెట్టించిందని టాక్ రావడం సెన్సేషన్ అయింది.

జ్యోతికపై కార్తి కామెంట్స్
సూర్య ఫ్యామిలీలో గొడవలపై వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై కార్తి స్పందించాడు. ఈ మేరకు ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'నేను జ్యోతికను ఎప్పుడూ వదినలా చూడలేదు. తనను అమ్మలాగే చూస్తాను. తను కూడా నన్ను కొడుకులానే భావించారు. వదిన ఇప్పుడు ముంబైలో ఉండడంతో ఇల్లంతా బోసిపోయింది. ఆమె లేకపోతే మేము ఉండలేకపోతున్నాం' అని చెప్పాడు.
ముంబై వెళ్లింది అందుకే
కార్తి కంటిన్యూ చేస్తూ.. 'ఇన్నేళ్ల నుంచి మేమంతా అన్యోన్యంగా కలిసి ఉన్నామంటే దానికి జ్యోతిక వదినే కారణం. తను మా అందరినీ మంచిగా చూసుకునేవారు. అన్నయ్య పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. వాళ్ల చదువులు ముఖ్యం. అందుకోసమే ముంబై వెళ్లిపోయారు. అవి పూర్తైన తర్వాత మళ్లీ కలిసే ఉంటాము. అప్పటి వరకూ దూరం తప్పదు' అంటూ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











