హీరో సూర్య ఫ్యామిలీలో కలహాలు: ఇల్లు వదిలి వెళ్లిపోయిన జ్యోతిక.. నిప్పులాంటి నిజాలు బయటపెట్టిన కార్తీ

కోలీవుడ్ నుంచి వచ్చినా.. ఇండియా మొత్తంలో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుని బడా సూపర్ స్టార్‌గా సత్తా చాటుతోన్నాడు సూర్య. విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తోన్న అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు.

ఈ మధ్య కాలంలో మరింత జోష్‌తో సినిమాలు చేస్తున్న సూర్య.. ఇప్పుడు పాన్ ఇండియాపై టార్గెట్ పెట్టాడు. ఈ నేపథ్యంలో అతడి కుటుంబంలో కలహాలు చెలరేగాయని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో తాజాగా దీనిపై సూర్య తమ్ముడు కార్తి స్పందించాడు. ఆ వివరాలు మీరే చూడండి!

Surya Jyothika With Kids

ముంబై షిప్ట్ అయిన సూర్య: తమిళ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో సూర్య తన తల్లిదండ్రులు శివకుమార్, లక్ష్మీతో పాటు సోదరుడు కార్తీతో కలిసి చాలా కాలంగా చెన్నైలోనే నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఉమ్మడి కుటుంబం అయినా వీళ్లంతా ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. అలాంటిది కొద్ది రోజుల క్రితమే హీరో సూర్య తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి ముంబై నగరానికి షిప్ట్ అయిపోయాడు.

Surya Jyothika Shifted To Mumbai

అన్ని కోట్లతో ఇల్లు కొనేసి: ముంబై నగరానికి మకాం మార్చేసిన సూర్య అక్కడ ఏకంగా రూ.70 కోట్లతో ఓ ఇల్లు కొనుగోలు చేశాడని, ఇకపై అక్కడే ఉండబోతున్నాడని కొద్ది నెలల క్రితమే న్యూస్ బయటకు వచ్చింది. దీనికితోడు ఆ సమయంలోనే సూర్య ముంబైలోని ఓ ఇంటి నుంచి బయటకు వచ్చి హోటళ్లకు వెళ్తున్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో సూర్య షిప్ట్ అయింది నిజమే అన్నారు.

Surya Jyothika Shifted To Mumbai

షూటింగ్ కోసమే అక్కడకు: హీరో సూర్య ముంబై నగరానికి మకాం మార్చడంపై ఎన్నో రకాల ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. అయితే, 'సూరరై పొట్రు' హిందీలో కూడా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతికలే నిర్మిస్తున్నారు. అందుకే వీళ్లు షిప్ట్ అయ్యారేమో అని టాక్ వచ్చింది. అలాగే, ప్రస్తుతం జ్యోతిక ఓ హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇది కూడా కారణం అయి ఉంటుందని అనుకున్నారు.

ఫ్యామిలీలో కలహాలతోనే: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముంబై నగరానికి షిప్ట్ అయిన తర్వాత ఆయన కుటుంబంలో కలహాల గురించి కూడా తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అత్తమామలకు జ్యోతిక సినిమాలు చేయడం ఇష్టం లేదని, ఈ కారణంగానే ఆమె సూర్యతో వేరే కాపురం పెట్టించిందని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది.

Hero Karthi Gives Clarity on Differences in Suriya Family

నేను అమ్మలాగే చూశాను: సూర్య ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై కార్తి స్పందించాడు. ఈ మేరకు ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'నేను జ్యోతికను వదినలా చూడలేదు. తనను అమ్మలాగే భావించాను. తను కూడా నన్ను కొడుకులానే చూశారు. వదిన ఇప్పుడు ముంబైలో ఉండడంతో ఇల్లంతా బోసిపోయింది. ఆమె లేకపోతే మేము ఉండలేకపోతున్నాం' అన్నాడు.

Hero Karthi Gives Clarity on Differences in Suriya Family

అందుకే వెళ్లిపోయారు: ఆ తర్వాత కార్తి కంటిన్యూ చేస్తూ.. 'ఇన్నేళ్ల నుంచి మేమంతా కలిసి ఉన్నామంటే దానికి జ్యోతిక వదినే కారణం. తను మా అందరినీ మంచిగా చూసుకోబట్లే అన్యోన్యంగా ఉన్నాం. అన్నయ్య పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. వాళ్ల చదువుల కోసమే ముంబై వెళ్లారు. అవి పూర్తైన తర్వాత మళ్లీ కలిసే ఉంటాము. అప్పటి వరకూ తరచూ కలుస్తుంటాము' అంటూ వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X