డైరెక్టర్ కోటి రూపాయల చీటింగ్.. హీరో కేసు.. హైకోర్టు ఝలక్!

తమిళ దర్శకుడు మిస్కిన్ మరోసారి వివాదంలో చిక్కుకొన్నాడు. ఓ సినిమాను పూర్తి చేయకుండానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడంతో బాధిత నిర్మాత, హీరోలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో దర్శకుడు మిస్కిన్‌కు ఝలక్ ఇచ్చింది. దాంతో ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌తో చేయాల్సిన సినిమాను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివారాల్లోకి వెళితే..

సినిమా చేస్తానని చెప్పి మోసం

సినిమా చేస్తానని చెప్పి మోసం

2015లో నిర్మాత రఘునందన్, అతడి కుమారుడు మైత్రేయతో సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఆ తర్వాత రూ.1 కోటి తీసుకొని సినిమా స్టార్ చేయకుండా తమను మోసం చేశాడని నిర్మాత రఘునందన్ ఆరోపించారు. విశాల్‌తో తుప్పరివాలన్ సినిమా పూర్తి చేసిన తర్వాత తమతో సినిమా చేస్తానని చెప్పి ఒప్పందాన్ని ఉల్లంఘించాడని మండిపడ్డారు.

మిస్కిన్‌కు మద్రాస్ హైకోర్టు ఝలక్

మిస్కిన్‌కు మద్రాస్ హైకోర్టు ఝలక్

మిస్కిన్ తమను మోసం చేశాడనే ఆరోపణలతో రఘునందన్, మైత్రేయ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన తర్వాత మిస్కిన్‌కు కోర్టు ఝలక్ ఇచ్చింది. ఒప్పందం పూర్తయ్యే వరకు మరో సినిమాను షూట్ చేయకూడదు లేదా రిలీజ్ చేయకూడదు అని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

విశాల్‌తో సినిమా తర్వాత

విశాల్‌తో సినిమా తర్వాత

ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌తో సైకో అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తుప్పరివాలన్ తర్వాత మైత్రేయతో తీయాల్సిన స్క్రిప్టును వాడుకొని ఉదయనిధితో సినిమా ప్రారంభించాడని అభియోగాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాలతో సైకో షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.

కష్టాల్లో మిస్కిన్

కష్టాల్లో మిస్కిన్

తాజా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో మిస్కిన్ కష్టాల్లో పడ్డాడు. ఉదయనిధి స్టాలిన్‌తో సినిమా వాయిదా పడటం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో విశాల్ మాకు సహకరిస్తానని, తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తానని హామీ ఇచ్చాడని మైత్రేయ మీడియాకు వెల్లడించారు. సైకో చిత్రంలో అదితిరావు హైదరీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X