Ayalaan Teaser Release: ఏలియన్ తో శివకార్తికేయన్ దోస్తీ.. అదిరిన అయలాన్ టీజర్, ఓ లుక్కేయండి బాసూ!

Ayalaan Teaser Release: ఈ ఏడాది మహావీరుడు సినిమాతో విజయం సాధించిన కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ మరో అద్భుతమైన సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా చేసిన కోయి మిల్ గయా సినిమా లాగే ఈ సినిమా కూడా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్నఈ అయలాన్ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ భాషలో విడుదల అయిన ఈ టీజర్ అద్భుతంగా ఉంది.

ఇందులో శివకార్తికేయన్ లుక్ అయితే సూపర్ ఉంది. ఒక్కో పీరియడ్ లో ఒక్కో ఎనర్జీ వరల్డ్ ను డామినేట్ చేసిందంటూ వాయిస్ ఓవర్ వస్తుండగా ఈ టీజర్ ప్రారంభం అయింది. అలాగే వాతావరణంలో ఏర్పడిన ఈ మార్పులు భూమినే అంతం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారంటూ చూపించే సన్నివేషాలు భయంకరంగా ఉన్నాయి. ఇది చూస్తేనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం అవుతుంది. అలాగే ఎన్నో ఏళ్ల క్రితం భూమిపై నివసించిన డైనోసర్ల గుడ్లు ఇప్పడు వెలుగులోకి వచ్చాయని చెబుతుండగా.. ఏలియన్ మన జోనరే కాదు కదా మామా అంటూ చెప్పే డైలాగ్ అందరిలోనూ టెన్షన్ ను నింపుతోంది.

Shivakarthikeyan

కానీ ఈ టెన్షన్ ద్వారానే ఈ సినిమా అంతా ఏలియన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏలియన్ భూమిపైకి దిగడం, ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. అలాగే ఏలియన్ తో శివకార్తికేయన్ దోస్తీ మరింత బాగుంది. ఈక్రమంలో వచ్చే కొన్ని కామెడీ సీన్లు కచ్చితంగా ప్రేక్షకులను నవ్విస్తాయి. ఈ సినిమా టీజర్ విడుదల అయిన గంటలోనే లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేసేయండి. సినిమా ఎలా ఉండబోతుందో చూసి తెలుసుకోండి.

భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ లో రాబోతున్న ఈచిత్రం వచ్చే ఏడాదికి సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అలాగే ఈ సినిమా కోసం అత్యధిక సంఖ్యలో సీజీ షాట్స్ ఉపయోగించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. శరద్ ఖేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగిబాబు, కరుణాకరమ్, బాల శరవణన్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. మరో విషయం ఏంటంటే నాలుగేళ్ల గ్యాప్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్.. ఈ సినిమా ద్వారా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 2019లో సూర్య హీరోగా నటించిన ఎన్జీకే సినిమాలో నటించిన ఆమె.. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రంలో కనిపించనున్నారు.

ఆర్. వీ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. అలాగే నీరవ్ షా సినిమాటోగ్రఫీ పనులు చూసుకోగా టి ముత్తురాజ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X