twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీటూ మూమెంట్..ఆధారం లేకుండా అత్యాచారం, నెటిజన్‌కి క్లాస్ పీకిన హీరో సిద్దార్థ్!

    |

    బాలీవుడ్ నుంచి మీ టూ మూమెంట్ తమిళ చిత్ర పరిశ్రమకు పాకింది. బాలీవుడ్ లో లైంగిక వేధింపుల గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సింగర్ చిన్మయి వ్యాఖ్యలతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా లైంగిక వేధింపుల అంశం హాట్ టాపిక్ గా మారింది. హీరో సిద్దార్థ్ మీటూ మూమెంట్ గురించి సోషల్ మీడియాలో స్పందించాడు. ఓ నెటిజన్ కు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. లైంగిక వేధింపుల ఘటనల్లో బాధితుల పక్షాన అంతా నిలబడాల్సిన అవసరం ఉందని సూచించాడు.

    ఎలాంటి ఆధారం లేకుండా

    ఎలాంటి ఆధారం లేకుండా

    ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. లైంగిక వేధింపుల గురించి నేను మాట్లాడను. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా మీ టూ మూమెంట్ ప్రముఖుల పరువు ప్రతిష్ఠలు, కీర్తిని దారుణంగా దిగజార్చే ప్రక్రియ అని అభిప్రాయ పడ్డాడు. దీనికి హీరో సిద్దార్థ్ స్పందించి ఘాటైన సమాధానం ఇచ్చాడు.

     నీవు చెప్పింది తప్పు

    నీవు చెప్పింది తప్పు

    సదరు నెటిజన్ ట్విట్ కు స్పందించిన సిద్దార్థ్.. అలాంటి అభిప్రాయం తప్పు అని చెప్పాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా అత్యాచారానికి పాల్పడి కొందరి జీవితాలని నాశనం చేయడమే దారుణమైన విషయం అని సిద్ధార్థ్ తెలిపాడు. కొంత మంది మహిళలు ఒకే విషయం గురించి మాట్లాడుతుంటే.. వినాల్సిన భాద్యత మనందరికీ ఉందని సిద్దార్థ్ సూచించాడు.

     చిన్మయి లాంటి సెలెబ్రిటీ

    చిన్మయి లాంటి సెలెబ్రిటీ

    చిన్మయి లాంటి సెలెబ్రిటీ తన పేరు ప్రతిష్ఠలనే పణంగా పెట్టి ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతుందంటే అది చాలా పెద్ద నిర్ణయం అని గ్రహించాలి. ఆమె నిందితులకు ఎదురునిలుస్తోంది. విచారణ జరిపించడం తొలి భాద్యత అని సిద్దార్థ్ తెలిపాడు. ఆమె తన పేరు చెప్పి మరీ లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతుంటే.. అది పబ్లిసిటీ కోసం అని మాట్లాడడం దారుణం అని సిద్దార్థ్ తెలిపాడు.

     వాళ్ళకి కూడా మీటూ లాంటిదే

    వాళ్ళకి కూడా మీటూ లాంటిదే

    ఒకవేళ నిందితులు నిజంగానే అమాయకులు, ఇలాంటి వేధింపులు చేయని వాళ్ళు అయితే వాళ్ళ నిజాయతీని నిరూపించుకోవాలి. ఇది వాళ్ళకి కూడా ఒక మీటూ మూమెంట్ లాంటిదే అని సిద్దార్థ్ తెలిపాడు. మొత్తంగా హాలీవుడ్ లో ప్రారంభమైన ఈ మీటూ మూమెంట్ ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది.

    English summary
    Hero Sidharth about MeToo moment. Sidharth gives strong counter to Neitizen
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X