38 ఏళ్ల వయసులో శింబుతో పెళ్లి.. రిలేషన్ గురించి ఓపెన్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్!

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల ఎఫైర్స్, పెళ్లి వార్తలు రావడం కామన్. ఇక ఇటీవల ఓ జంట గురించి వార్తలు కోలీవుడ్ మీడియాతో పాటు.. టాలీవుడ్లోనూ చక్కర్లు కొడుతున్నాయి. శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి, తమిళ స్టార్ హీరో శింబు ప్రేమలో ఉన్నట్లు.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై శింబు, వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించారు. అంతే కాదు వారి రిలేషన్ గురించి ఓపెన్ అయి షాకిచ్చారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

కోలీవుడ్‌లో మోస్ట్‌ బ్యాచిలర్‌ హీరో ఎవరు అంటే మొదట గుర్తుకు వచ్చేది శింబు. ఇక హీరోయిన్ల జాబితాలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఉన్నారు. తమిళ హీరో శింబు తెలుగు వారికి సుపరిచితమే. అతని సినిమాలు చాలా వరకు తెలుగులోనూ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. మరోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో బిజీ అయిన సంగతి తెలిసిందే. వీరసింహరెడ్డి సినిమా, హనుమాన్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ.

Hero Simbu and Varalaxmi Sarath Kumar Reacted on Marriage Rumours Full Details Here

గత కొంతకాలంగా వరలక్ష్మి శరత్ కుమార్, శింబు వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. గతంలోనూ వీరిద్దరిపై ఇలాంటి వార్తలే రాగా.. ఈ మధ్య కాలంలో ఏకంగా పెళ్లి చేసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. దీనికి బలమైన కారణం ఏంటంటే.. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా కలిసి నటించడమేనని తెలుస్తోంది. మరోవైపు ఇద్దరు కుటుంబాలు సినీ నేపథ్యం కలిగిన కుటుంబాలే కావడం.. పైగా వీరి తల్లిదండ్రులు మంచి స్నేహితులవడంతో ఈ వార్తలు నిజమై ఉంటాయని అందరూ అనుకున్నారు.

Hero Simbu and Varalaxmi Sarath Kumar Reacted on Marriage Rumours Full Details Here

పైగా... శింబు పుట్టిన రోజైన ఫిబ్రవరి 3న శుభవార్తను వెల్లడిస్తానని చెప్పడంతో.... దీంతో వరలక్ష్మితో పెళ్లి గురించిన ప్రకటనే అయ్యింటుందని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో శింబు, వరలక్ష్మి ఈ రూమర్స్ పైన వేర్వేరుగా రియాక్ట్ అయ్యారు. శింబు ఈ విషయంపై మాట్లాడుతూ... తాను, వరలక్ష్మి మంచి స్నేహితులమని చెప్పుకువచ్చారు. తాను ఆమెను వివాహం చేసుకోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు.

మరోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ...శింబుకు నాకు పెళ్లి జరగడం లేదని చెప్పుకువచ్చింది. అతను నా స్నేహితుడని క్లారిటీ ఇచ్చింది. దీంతో శింబు, వరలక్ష్మీ శరత్ కుమార్‌ పెళ్లి అనే రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక వీరిద్దరూ నటులుగా బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమాతో వరలక్ష్మి శరత్ కుమార్ సూపర్ హిట్టును అందుకుంది.

Hero Simbu and Varalaxmi Sarath Kumar Reacted on Marriage Rumours Full Details Here

ఇక శింబు కూడా వరుసగా సిిినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా కమల్ హాసన్ నిర్మణంలో ఓ సినిమా చేస్తున్నారు. శింబు బర్త్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక శింబు విషయానికి వస్తే.. శింబు లవ్ స్టోరీలు ఎప్పుడూ వైరల్ గానే నిలిచాయి. నిశ్చితార్థం దాకా వెళ్లి ఆగిపోయిన రోజులు ఉన్నాయి. ఇక ప్రస్తుతానికి శింబు, వరలక్ష్మి స్నేహితులం అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్ కు చెక్ పెట్టేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X