నయనతార, త్రిష, హన్సికతో అఫైర్.. యంగ్ హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న హీరో!
సినిమా పరిశ్రమలో అఫైర్లు, డేటింగ్, సహజీవనాలకు పెద్దగా అర్ధాలే ఉండవు. ఏ హీరో రిలేషన్ ఎప్పుడు మొదలవుతుందో.. ఎందుకు బ్రేకప్ అవుతుందో చెప్పడం కష్టమే. అలాంటి ఈ తరం నటుల్లో జీవితాన్ని మాత్రం ఏ మాత్రం తగ్గుకుండా మూడు అఫైర్లు, ఆరు బ్రేకప్స్ అనే విధంగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అయితే తాజాగా గతంలో ముగ్గురు స్టార్ హీరోయిన్లతో డేటింగ్, సహజీవనం చేసిన యంగ్ హీరో ప్రస్తుతం మరో హీరోయిన్‌తో పెళ్లికి సిద్దమవుతున్నాడనే విషయాన్ని స్వయంగా ఆ హీరో తండ్రి వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఆ హీరో, హీరోయిన్ల ప్రేమ వ్యవహరాలు, తాజాగా హీరో పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించిన వివరాల్లోకి వెళితే..
తమిళ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరైనా ఉన్నారా? అంటే అది హీరో శింబు మాత్రమే. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. తండ్రి వారసత్వంతో హీరోగా మారిన ఈ టాలెంటెడ్ యాక్టర్ జీవితంలో రకరకాల అపైర్లు, బ్రేకప్స్ చాలానే ఉన్నాయి. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన హీరోయిన్‌తో దాదాపు ఈ హీరో పేరు జోడించేలా రూమర్లు మీడియాలో వస్తుంటాయి. ఆ రూమర్లకు తగినట్టుగానే ఈ డేటింగ్ వార్తలు కూడా భారీగానే వస్తుంటాయి.

వరుస సక్సెస్‌లతో శింబు తన తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకొన్నారు. నటుడిగా, గాయకుడిగా, ఇతర విభాగాలపై పట్టు సాధించిన ఈ హీరో జీవితంలోకి ముందుగా వచ్చిన హీరోయిన్ నయనతార. వీరిద్దరు కలిసి నటించిన సినిమా హిట్ కావడంతో, ఆ సినిమాలోని కెమిస్ట్రీ బాగా కుదరడంతో నిజ జీవితంలో కూడా అఫైర్‌తో ఫిక్స్ అయ్యారు. వారిద్దరూ పెళ్లి ఖాయమని అందరూ భావించిన సమయంలో నయనతార, శింబు బ్రేకప్ చెప్పుకొన్నారు.
ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లతో శింబు అఫైర్ వార్తలు బయటకు వచ్చాయి. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా నిలబడలేకపోయాయి. కానీ త్రిషతో అఫైర్ మాత్రం గట్టిగానే వినిపించింది. అయితే కొన్నాళ్లు చాటుమాటుగా సాగిన ఈ వ్యవహారం ఆ తర్వాత చల్లబడిపోయింది. ఇక ఆ తర్వాత ఆయన ప్రేమ వ్యవహారం హన్సిక మోత్వానీతో బలంగా వినిపించింది. దాదాపు పెళ్లి వరకు వచ్చి వారిద్దరి బంధం ఆగిపోయింది. అయితే హన్సిక, త్రిష, నయనతారతో బ్రేకప్ విషయం ఏం జరిగిందనే ఎవరికీ తెలియని రహస్యంగానే ఉండిపోయింది.

అయితే ఇటీవల శింబు తండ్రి టీ రాజేందర్ తన కొడుకు శింబు పెళ్లి వ్యవహారం గురించి తెలుగు మీడియాతో ఓపెన్ అయ్యారు. తన కుమారుడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. తనది ప్రేమ పెళ్లి అంటూ ఓ వార్తను మీడియాకు లీక్ చేశారు. దాంతో శింబు పెళ్లి ఆ హీరోయిన్‌తోనే అంటూ గట్టిగా మీడియాలో న్యూస్ విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అయితే ఆ హీరోయిన్ ఎవరనే ఆరా తీయడం మొదలుపెట్టారు.
గత కొద్దికాలంగా తమిళ మీడియాలో శింబు, నిధి అగర్వాల్ ప్రేమ వ్యవహారం గురించి గట్టిగా వినిపిస్తున్నది. హరిహర వీరమల్లు సినిమా తర్వాత నిధి అగర్వాల్ పెళ్లి ఉంటుందనే ఊహగానాలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే టీ రాజేందర్ లీక్ ఇచ్చారా? అని గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఏది ఏమైనా శింబు మాత్రం ఓ ఇంటి వాడు కాబోతున్నాడనే వార్త మాత్రం వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











