70 కోట్లతో బంగ్లా.. 120 కోట్లతో ప్రైవేట్ జెట్ కొనేసిన సౌత్ స్టార్ హీరో!

సినీ పరిశ్రమకి చెందిన నటీనటులకు పర్సనల్ గా కొన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ లు ఉంటూనే ఉంటాయి. ఒకరికి మంచి డిజైనర్ కార్లు మార్కెట్ లోకి వచ్చిన కొత్త కారు లేదా బైక్ లు కొనుకుంటారు. ఇంకొందరు ఖరీదైన వాచ్ లు, మరికొందరు జంతు ప్రేమికులు అయితే కుక్కలు, గుర్రాలు ఇలా రకరకాల టేస్ట్ లు చూపిస్తూ తమ పర్సనల్ లైఫ్ లో తమకి నచ్చినట్టుగా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు.

అయితే ఆ అందరితో పాటుగా మరికొందరు ఇంకొంత బ్రాడ్ గా ఆలోచించే వాళ్లలో అది కూడా పెద్ద స్టార్స్ అయితే మాత్రం తమ చెయ్యి చిన్న చిన్న వాటి మీద పెట్టరు. కొడితే వందల కోట్ల లోనే ఖర్చు పెడతారు. అలానే చాలా మంది స్టార్ హీరోస్ లో ప్రపంచ వ్యాప్యంగా అనేక దేశాల్లో ప్రత్యేక బంగ్లాలు, స్పెషల్ ఫ్లైట్ లు ఇంకా ప్రపంచ ప్రీమియం బ్రాండ్ కార్లు లాంటివి కొనుగోలు చేస్తుంటారు. వాటి కోసం ఎంతైనా వారు ఖర్చు పెట్టేందుకు వెనుకాడరు.

Hero Suriya bought a costly plane for him with 120 crore

కాగా ఇలానే మన సౌత్ కి చెందిన ఓ స్టార్ హీరో తాజాగా ఓ ప్రైవేట్ విమానాన్ని కొనేసినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో ఏకంగా ఒకటి రెండు కాదు ఏకంగా 120 కోట్ల రూపాయలు పెట్టి తనకంటూ సెపరేట్ జెట్ ఉండాలని కొనుగోలు చేసాడట. కాగా ఆ హీరో మరెవరో కాదు తెలుగు, తమిళ ఆడియెన్స్ కి బాగా సుపరిచితం అయ్యిన హీరో సూర్యనే అట..

కాగా సూర్య డస్సాల్ట్ ఫాల్కన్ 2000 అనే బిజినెస్ క్లాస్ ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేసుకున్నాడట. కాగా ఇది మన దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే సొంతం ఐతే ఆ కొంతమందిలో సూర్య కూడా ఒకదాని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా దీనికి ముందే కొన్నాళ్ల కితమే ముంబైలో ఏకంగా 70 కోట్ల విలువైన బంగ్లా కూడా కొనుగోలు చేశాడనీ పలు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడేమో ఇది.. మరి ఈ వార్తల్లో ఎంతమేర నిజముందో కాలమే చూపించాలి.

Hero Suriya bought a costly plane for him with 120 crore

కాగా ప్రస్తుతం సూర్య నటించిన భారీ సినిమా "కంగువా" రిలీజ్ కి రాబోతుంది. దర్శకుడు శివ తెరకెక్కించగా ఈ సినిమా తమిళ్ సినిమా నుంచి హైయెస్ట్ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా రాబోతుంది. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా ప్రపంచ వ్యాప్తంగా 3డి అండ్ 2డి వెర్షన్ లలో కూడా రిలీజ్ కాబోతుంది.

అయితే బిగ్ స్క్రీన్స్ పై ఈ చిత్రం 10కి పైగా భాషల్లో అందుబాటులోకి రానుంగ ఓటిటిలో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 32 భాషల్లో అందుబాటులోకి వస్తుంది అని టాక్. అలాగే ఈ సినిమాకి కూడా మేకర్స్ సీక్వెల్ ని ఫిక్స్ చేయగా ఫస్ట్ పార్ట్ ఈ అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

More from Filmibeat

Read more about: kanguva disha patani jyothika
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X