Suriya సూర్యకు ప్రమాదం.. షూటింగ్ నిలిపివేత.. హీరో పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ విపరీతమైన అభిమానులను కల్గి ఉన్న ఈయన.. అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. సూర్య సినిమాలన్నీ దాదాపుగా తెలుగులో డబ్బింగ్ అవుతంటాయి. సూర్య సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగానే మార్కెట్ అంది. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ చిత్రాల తర్వాత హీరో సూర్య ఏ చిత్రంలోనూ కనిపించలేరు. అయితే ఈ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా... తాజాగా హ్యాట్రిక్ కొట్టేందుకు సరికొత్త కథాంశంతో వస్తున్నారు.
ముఖ్యంగా దర్శకుడు శివ డైరెక్షన్ లో కంగువా చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాదు. ఈ చిత్రంలో సూర్య సరసన దిశా పటాని నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుపుకుంటోంది. ఈక్రమంలోనే ఈ సినిమా షూటింగ్ లో ఓ ప్రమాదం చోటు చేసుకోగా.. హీరో సూర్యకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. హీరో సూర్యకు సంబంధించిన యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా.... సడెన్ గా వచ్చి కెమెరా ఆయన మీద పడిందట. ఈక్రమంలోనే ఆయన భుజానికి తీవ్ర గాయం అయినట్లు సమాచారం.

ప్రమాదం జరిగినట్లు గుర్తించిన చిత్రబృందం ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే చిత్ర బృందం షూటింగ్ కూడా నిలిపివేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన మూవీ టీం.. సూర్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని... కాకపోతే స్వల్ప గాయాలు కావడం వల్ల కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు వివరించారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య అభిమానులు ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా సూర్యకు ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సూర్య, దిశా పటానిలు హీరోహీరోయిన్లుగా కనిపిస్తుండగా.. బాబీ డియోల్ ప్రతినాయకుడిని కనిపించబోతున్నారు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతి బాబు, కమెడియన్ యోగి బాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టూడియోస్ గ్రీన్, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం మూడు పార్టుల్లో ఈ సినిమాను తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.

వచ్చే ఏడాది వేసవి కానుకగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఏకంగా 38 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రొడ్యూసర్ ప్రకటించారు. ఐమ్యాక్స్, 3డీ వెర్షన్ లలో కంగువా చిత్రాన్ని అందుబాటులో ఉంచబోతున్నట్లు ప్రకటించి అందిరినీ సర్ ప్రైజ్ చేశారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











