twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంత వీలైత అంత చేయండి.. ఫ్యాన్స్‌కు హీరో విజ్ఞప్తి

    |

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వైరస్ ధాటికి అగ్ర రాజ్యం కూడా అతలాకుతలమైపోతోంది. మన దేశంలోనూ రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతోంది. ఇప్పటికే రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వేల మంది మృత్యువాత పడ్డారు. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయమే.

    కరోనా లాంటి విపత్కర కాలంలో ప్రతీ ఒక్కరూ ఎన్నో బాధలు అనుభవించారు. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఇంకెంతో మంది వలస కార్మికులు రోడ్డున పడ్డారు. అయితే వీరిని ఆదుకునేందుకు ఎంతో మంది ముందుకు వచ్చారు. సినీ తారలంతా ముందుకు వచ్చి వారికి చేతనైన సాయాన్ని చేశారు. ఈ క్రమంలో హీరో సూర్య తన అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు.

    Hero suriya Request Fans To Help Needy

    సూర్య అభిమానులు సైతం ఎందరో పేదలకు అనేక విధాలుగా సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా సూర్య తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కష్టకాలంలో అభిమానులు నిరంతరం సేవా కార్యక్రమాలు పాల్గొనడం సాధారణ విషయం కాదన్నారు. పేదలకు ఎంతవరకు సాయం చేయగలరో అంతవరకు చేయండని అన్నాడు. అయితే ఏ విధంగానూ తనకు బాధ కలిగించేవి చేయొద్దని పేర్కొన్నాడు.

    అధేవిధంగా కొందరు ప్లాస్టిక్‌ బాటిళ్లను ఉపయోగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నాడు. అలాంటివి సాధ్యమైనంత వరకు నిషేధించాలని చెప్పారు. నిరంతరం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తన అభిమానులను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు సూర్య పేర్కొన్నాడు.

    English summary
    Hero suriya Request Fans To Help Needy. Suriya says His Fans That DO Help How Much They Can Do. suriya Agaram Foundation Helps SO many People in This Crisis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X