మద్దెలచెరవు సూరి హత్యపై హీరో సూర్య స్పందన
"రక్త చరిత్ర-2" చిత్రంలో మద్దెలచెరువు సూరి పాత్రలో నటించిన తమిళ హీరో సూర్య..సూరి హత్యపై చెన్నైలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ...సూరి హత్య గురించి తనకు తెలియదని, మానవత్వంతో ఆలోచిస్తే ఎవరినైనా హత్య చేయడం సరికాదని అన్నారు. అలాగే ఎవరు ఎవరిని హత్య చేసినా అది తప్పేనని అన్నారు. ఇక పరిటాల రవిగా 'రక్త చరిత్ర' లో చేసిన వివేక్ ఒబెరాయ్ స్పందిస్తూ....సూరి హత్య గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడతానని అన్నారు. మరో ప్రక్క మీడియా మొత్తం రక్త చరిత్ర-3 అంటూ ఈ హత్యకు హెడ్డింగులు పెట్టి ప్రసారం చేస్తోంది.
పూరీ జగన్నాధ్ సూర్య రామ్ గోపాల్ వర్మ బెజవాడ రౌడీలు puri jagannath appalaraju bezawada rowdy ram gopal varma


Click it and Unblock the Notifications