డబ్బింగ్ తో విసుగెత్తిన హీరో ఇక స్ట్రెయిట్ సినిమాలే...
ఇప్పటిదాకా డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు తెరపై ఓ వెలుగు వెలుగుతోన్న తమిళ హీరో సూర్య, ఇకపై డైరెక్ట్ గా తెలుగు తెరపై ఎటాక్ చేయాలనుకుంటున్నాడు. డైరెక్ట్..అంటే తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కబోయే సినిమాలో నటిస్తున్నాడు. హీరో సూర్య ఈ చిత్రాన్ని సూర్య సతీమణి, నిన్నమొన్నటి హీరోయిన్ జ్యోతిక నిర్మించనున్నట్టు సమాచారం.
తెలుగు సినిమాల్లో నటించాలన్న కోరిక ఇలా తీరుతున్నందకు చాలా ఆనందంగా వుందంటోన్న సూర్య త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తున్నాడట. అటు తమిళనాడులోనూ, ఇటు ఆంద్రప్రదేశ్ లోనూ సమానంగా షూటింగ్ డేస్ వుంటాయనీ, కథ పరంగా రెండు ప్రాంతాలనూ మిక్స్ చేస్తున్నామని సూర్య చెబుతున్నాడు. డబ్బింగ్ సినిమాలతోనే టాలీవుడ్ బాక్సాఫీస్ ని కొల్లగొట్టేస్తోన్న సూర్య, డైరెక్ట్ ఎటాక్ తో ఇంకెంతగా టాలీవుడ్ బాక్సాఫీస్ ని శాసిస్తాడో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











