twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియల్ హీరోగా ప్రవర్తించు.. ఖరీదైన కారు కొని పన్ను చెల్లించవా? విజయ్‌కు హైకోర్టు మొట్టికాయ.. దారుణంగా ట్రోలింగ్

    |

    తమిళ సూపర్‌స్టార్ విజయ్ అలియాస్ జోసెఫ్ విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న విలాసవంతమైన కారును పన్ను మినహాయింపు ఇవ్వాలని విజయ్ దాఖలు చేసుకొన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. విజయ్ వ్యవహార తీరును కోర్టు తీవ్రంగా మందలించడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు విజయ్‌‌ను ట్రోల్ చేస్తుండటంతో ఆయన ట్రెండింగ్‌గా మారారు. ఆ వివాదం వివరాల్లోకి వెళితే..

    ఇంగ్లాండ్ నుంచి కారు దిగుమతి

    ఇంగ్లాండ్ నుంచి కారు దిగుమతి

    కోలీవుడ్ సూపర్‌స్టార్ విజయ్ ఇటీవల ఇంగ్లాండ్‌లో అతి ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ మోటార్ కారును కొనుగోలు చేశారు. దానిని దిగుమతి చేసుకొన్న సమయంలో ఎంట్రీ ట్యాక్స్ కట్టే విషయంలో మినహాయింపు ఇవ్వాలని దరఖాస్తు చేసుకొన్నారు. అయితే అందుకు అధికారులు నిరాకరించడంతో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    విజయ్ తీరును తప్పుపట్టిన కోర్టు

    విజయ్ తీరును తప్పుపట్టిన కోర్టు

    విజయ్‌పై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యంతో కూడిన బెంచ్‌ విచారించింది. విజయ్ తీరును తప్పుబడుతూ రెండు వారాల్లోగా ఎంట్రీ ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లించాలి. పన్ను చెల్లింపులో జాప్యం జరిగినందుకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాలి. ఆ మొత్తాన్ని తమిళనాడు చీఫ్ మినిస్టర్స్ కోవిడ్ 19 రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలి అని హైకోర్టు తీవ్రంగా మందలించింది. తీర్పు సందర్భంగా విజయ్ పేరును పలకడానికి నిరాకరిస్తూ.. సదరు సినీ నటుడు అంటూ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

    పన్ను ఎగవేత దురదృష్టకరం

    పన్ను ఎగవేత దురదృష్టకరం

    విజయ్‌కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌‌పై తీర్పు వెల్లడిస్తూ.. ఇంగ్లాండ్ నుంచి ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన బ్రాండెడ్ కారును దిగుమతి చేసుకొన్నారు. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ఎంట్రీ ట్యాక్స్ చెల్లించకపోవడం దురదృష్టకరం. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న సినీ నటుడు సకాలంలో, కచ్చితమైన పన్ను చెల్లించాల్సి ఉండాల్సింది అంటూ విజయ్‌కు కోర్టు మొట్టికాయలు వేసింది.

     పన్ను ఎగవేత దేశద్రోహమే

    పన్ను ఎగవేత దేశద్రోహమే

    తమిళనాడులో సినిమా హీరోలు రాష్ట్రానికి సంబంధించి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ప్రజల దృష్టిలో సినీ హీరోలు రియల్ హీరోలు. పన్ను ఎగవేతకు పాల్పడటం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం. రాజ్యంగ వ్యతిరేక పనులు, మైండ్‌సెట్‌, ప్రవర్తనను మానుకోవాలి. సకాలంలో పన్ను చెల్లించకపోవడం రాజ్యాంగ వ్యతిరేక చర్యే అంటూ విజయ్‌ను కోర్టు మందలించింది.

    ప్రముఖులంతా జాతి సంపదే..

    ప్రముఖులంతా జాతి సంపదే..

    విజయ్‌ పిటిషన్‌పై తీర్పును వెల్లడిస్తూ.. దేశంలో ప్రముఖ వ్యక్తులు జాతికి సంపద లాంటి వారు. వారు సంపాదించే సొమ్మంతా పేద ప్రజల కష్టార్జితం. వారి సంపాదన అంతా ఆకాశం నుంచి ఊడి పడదు. వారు చెల్లించే పన్నులు సంక్షేమానికి దోహదపడుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి పన్ను చెల్లించే విషయంలో ప్రముఖులు రూల్స్ పాటించాలి అని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

     దిగుమతి సుంకం చెల్లించా అంటూ విజయ్

    దిగుమతి సుంకం చెల్లించా అంటూ విజయ్

    విజయ్ కారు వివాదం ఏమిటంటే.. ఆయన 2012లో దిగుమతి చేసుకొన్న రోల్స్ రాయిస్ కారు పన్ను మినహాయింపు ఇవ్వాలి. ఇప్పటికే ఆ కారు కోసం కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు దిగుమతి సుంకం చెల్లించాం అని పన్ను విధింపు అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అయితే ఆయన విన్నపాన్ని తిరస్కరిస్తూ.. తప్పని సరిగా ఎంట్రీ టాక్స్ చెల్లించాలని అసిస్టెంట్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులపై విజయ్ కోర్టుకు వెళ్లగా.. సినీ నటుడి పిటిషన్ తిరస్కరించి కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

    English summary
    Kollywood Hero Vijay aka Joseph Vijay trolled heavily on twitter after Madras courts sensational judgement against him. Madras High Court fined 1 lakh rupees and asked to pay entry tax on Rolls Royce Ghost Motor car.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X