విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు.. అగంతకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?
తమిళ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్ నివాసానికి బాంబు బెదిరింపు వ్యవహారంపై చెన్నై పోలీసులు వివరణ ఇచ్చారు. తమకు వచ్చిన బాంబు బెదిరింపు కాల్‌పై దర్యాప్తు చేశామని, అది కేవలం బెదిరింపు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని చెన్నై పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ కాల్ చేసింది ఎవరు? ఎందుకు చేశారనే విషయంలోకి వెళితే..

ఫ్యాన్స్‌తో విజయ్ సమావేశమైన నేపథ్యంలో
ఇళయ దళపతి విజయ్ ఆదివారం తన అభిమానులతో సమావేశమయ్యారు. గతంలో నిర్వహించిన మీట్ ది విజయ్ పోటీలో విజయం సాధించిన వారితో భేటీ అయ్యారు. చెన్నైలోని నీలంకరాయ్‌లోని తన నివాసంలో కలువడానికి వచ్చిన ఫ్యాన్స్‌లో ఫోటోలు దిగుతున్న సమయంలో అగంతక వ్యక్తి ఫోన్ చేసి విజయ్ ఇంటిలో బాంబు పెట్టినట్టు సమాచారం వచ్చినట్టు చెన్నై పోలీసులు వెల్లడించారు. దాంతో చెన్నైలోని పలు ప్రాంతాలలో అప్రమత్తమయ్యారు.

అగంతకుడి ఫోన్ కాల్‌తో చెన్నై పోలీసులు
అంగతకుడి ఫోన్‌తో చెన్నైలోని నీలంకరాయ్‌లోని నివాసంలో సోదాలు మొదలుపెట్టారు. వెంటనే డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. విజయ్ ఇంటిని బాంబ్ స్వ్కాడ్ అనువణువు గాలించారు. అంతేకాకుండా విజయ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకొన్నారు. దాంతో బెదిరింపు కాల్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

అగంతకుడి అరెస్ట్‌తో..
విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి కాల్స్ వచ్చాయి. ఈసారి వచ్చిన ఫోన్ కాల్ గురించి దర్యాప్తు చేశాం. ఆ ఫోన్ కాల్ విల్లుపురం జిల్లా నుంచి వచ్చినట్టు టెక్నికల్ సెల్ గుర్తించింది. ఆ తర్వాత విచారణ చేసి అగంతకుడిని అరెస్ట్ చేసినట్టు చెన్నై పోలీసులు తెలిపారు.

రెగ్యులర్‌గా ఫోన్ చేసే నిందితుడి పని
అయితే విజయ్ ఇంటికి బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి భువనేశ్వరన్. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడ్డాడు. చాలా సార్లు భువనేశ్వరన్ పోలీసులకు ఫేక్ ఫోన్ కాల్స్ చేసిన ఆధారాలు ఉన్నాయి. అతడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నాం. ఈ కాల్ వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో కూడా విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
గతంలో 2020లో ఓ అగంతకుడు విజయ్ ఇంటిలో బాంబు పెట్టాం. ఏ క్షణంలోనైనా పేలడం ఖాయం అంటూ చెన్నై పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఫోన్ చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదు. అతడి ఫోన్ కాల్ బెదిరింపు మాత్రమే అని పోలీసులు తేల్చేశారు. ఇలా విజయ్ నివాసానికి బాంబు పెట్టినట్టు ఫోన్లు రావడంపై చెన్నై పోలీసులు సీరియస్‌గా దృష్టిపెట్టారు.
Recommended Video

విజయ్ సినీ కెరీర్ ఇలా
ఇళయ దళపతి విజయ్ కెరీర్ విషయానికి వస్తే.. సర్కార్, బిజిల్, మాస్టర్ లాంటి భారీ విజయాలత తర్వాత దళపతి నటిస్తున్న చిత్రం బీస్ట్. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బీస్ట్ తర్వాత వంశీపైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్‌లో వచ్చే చిత్రంలో నటించడానికి సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications











