పార్టీ పెట్టడం లేదు...ఎందులోనూ చేరటం లేదని వివరణ

By Srikanya

చెన్నై : తాను త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభించనున్నారంటూ ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై తమిళ హీరో విజయ్‌ స్పందించారు. అలాంటి ఆలోచన తనకు లేదని, దీని గురించి ఎవరితోనూ చర్చించలేదని పేర్కొన్నారు. 'ఇలయ తలబది' విజయ్‌ తన 'తలైవా' విడుదల సమయంలో రాజకీయంగా పలు సమస్యలు ఎదుర్కొన్నారని, అందువల్ల పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు, ఇందుకోసం కేరళలోని అభిమానులతో విజయ్‌ చర్చించారని వార్తలు వచ్చాయి.

దీనిపై విజయ్‌ మాట్లాడుతూ.. ''రాజకీయ అరంగేట్రం కోసం కేరళలో అభిమానులతో మాట్లాడాననే వార్తలు చదివాను. దీన్ని చూసి అభిమానులు, ప్రజలతోపాటు నేను కూడా ఆశ్చర్యానికి గురయ్యా. అదంతా తప్పుడు సమాచారమే. వాస్తవానికి రెండు నెలలుగా 'జిల్లా' షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో ఉన్నా. కేరళకు వెళ్లలేదు. ఈ తరహా వార్తల వల్ల అభిమానుల్లో గందరగోళం నెలకొంటోంది. ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయాలనే ఉద్దేశంతో రేయింబవళ్లు షూటింగ్‌లో పాల్గొంటున్నా. నా అభివృద్ధిలో మీడియాకు ప్రముఖ స్థానముంది. ఈ తరహా వార్తలను దయచేసి ప్రచురించి గందరగోళం సృష్టించొద్దు''అని తెలిపారు.

విజయ్‌, కాజల్‌ జంటగా రూపొందుతున్న తమిళ చిత్రం 'జిల్లా' హాస్పిటల్‌, ఎం.పి బిల్డింగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. మోహన్‌లాల్‌, విజయ్‌పై కీలక సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. ఆర్టీ నేసన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.బి.చౌదరి నిర్మాత. దర్శకుడు నేసన్ మాట్లాడుతూ...: ఈ పేరునే టైటిల్ గా ఎందుకు ఎంచుకున్నారో చెప్తూ... సినిమా చిత్రీకరణ ప్రదేశాలను చూసేందుకు విజయ్‌తో కలసి మదురై వెళ్లాం. అప్పుడు అక్కడో వ్యక్తిని అందరూ 'జిల్లా.. జిల్లా' అంటూ పిలిచారు. ఓ గ్రూపులో చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఉండే వ్యక్తిని 'జిల్లా' అనే పిలుస్తారట. ఆ విషయాన్ని విజయ్‌కి చెప్పాం. 'అరె బాగుందే.. ఆ పేరే పెట్టేద్దాం..' అన్నారు. అలా ఈ పేరొచ్చింది.

ఇక అశోక్‌- విశాఖ జంటగా 'మురుగా' తెరకెక్కించా. పెద్దగా ఆడలేదు. మంచి అవకాశం కోసం వేచి చూశా. ఆ తర్వాత 'వేలాయుధం' చిత్రానికి పనిచేస్తుండగా విజయ్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయనకు రెండు కథలు వినిపించాను. అందులో ఒకటి 'జిల్లా'. విజయ్‌ నటిస్తానని అంగీకరించారు. అలా తెరపైకి వచ్చిందీ కథ. కొత్త సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు 'ఇలయ తలబది' విజయ్‌ అభిమానులు. అందుకు తగ్గట్టుగానే విజయ్‌ కూడా ఒక సినిమా విడుదల కాకముందే కొత్త చిత్రం సన్నాహాలు ప్రారంభిస్తాడు. అలా ఈ చిత్రం మొదలైంది అన్నారు. మోహన్‌లాల్‌, విజయ్‌.. ఇలా ఇద్దరు పెద్ద మాస్‌ హీరోలను చాలా సంతోషంగా ఉంది. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చదువుకునేటప్పుడు మోహన్‌లాల్‌ సినిమాలను చూసి చాలా విషయాలను నేర్చుకునేవాణ్ని.

కథ చెప్పేటప్పుడే ఓ పాత్రకు తప్పనిసరిగా మోహన్‌లాల్‌ గారిని నటింపజేయాలని కోరాను. కథ చాలా బాగుందని విజయ్‌, నిర్మాత ఆర్‌బీ చౌదరి చెప్పారు. వెంటనే లాల్‌ను ఒప్పించారు. ప్రారంభంలో నేను కూడా భయపడ్డా. ఇద్దర్నీ ఎలా మోయగలమని..! చిత్రీకరణలో ఏ సమస్యా రాలేదు. స్కిప్టులో ఇద్దరికీ విడివిడిగా సన్నివేశాలను సమంగా పంచా. అయినా ఎక్కడో సందేహం.. ఏమవుతుందోనని. షూటింగ్‌స్పాట్‌లో ఇద్దరూ సర్దుకు పోవడం చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. ఒకరి షూటింగ్‌ జరిగేటప్పుడు మరొకరు వేచి ఉండేవారు. చాలా సరదాగా సాగుతోంది అన్నారు. 'తలైవా' తర్వాత విజయ్‌ చిత్రాలపై అంచనాలు వేరేలా ఉన్నాయి. అయినా ఇందులో ఏమాత్రం రాజకీయ అంశాలు లేవు. రెండేళ్ల కిందట నేను అనుకున్న సాధారణ కథే ఇది. 'జిల్లా' పూర్తి కమర్షియల్‌ చిత్రం.

ఇక 'తలైవా' సమస్య గురించి విజయ్‌ మీ వద్ద ప్రస్తావించలేదు. ఈ సమస్య తారాస్థాయికి చేరుకున్నప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. 'జిల్లా'కు కావాల్సిన హావభావాలు మాత్రమే ఆయనలో కనిపించాయి. చాలా సాధారణంగా ఉండేవారు. 'మనవల్ల ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారే..' అనే బాధమాత్రం కనిపించింది. 'షాట్‌ రెడీ..' అనే మాట వినగానే మిగిలిన అన్ని విషయాలను మరిచిపోతారు విజయ్‌ అంటూ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X