twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తండ్రిని ఎదిరించిన హీరో విజయ్.. రాజకీయ, కుటుంబ విభేదాలపై తల్లి సంచలన ప్రకటన

    |

    తమిళ సూపర్‌స్టార్ విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం గందరగోళంగా మారింది. తండ్రి ఏర్పాటు చేసిన పొలిటికల్ పార్టీతో తనకు సంబంధం లేదని విజయ్ బహిరంగ ప్రకటన చేశారు. అయితే తండ్రి రాజకీయ పరంగా సైద్దాంతిక విబేధాలు ఉన్నట్టు తాజాగా వార్తలు వైరల్ అవుతున్న సమయంలో తల్లి చెప్పిన విషయాలు ఆసక్తిని రేపాయి. తండ్రితో విజయ్‌కి ఉన్న విభేదాలపై తల్లి వివరిస్తూ...

    రాజకీయ పార్టీని ప్రారంభించిన ఎస్ఏ చంద్రశేఖర్

    రాజకీయ పార్టీని ప్రారంభించిన ఎస్ఏ చంద్రశేఖర్

    హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఇటీవల భారత ఎన్నికల సంఘంలో ఆల్ ఇండియా విజయ్ మక్కల్ ఇయాక్కమ్ అనే పార్టీని నమోదు చేశారు. అయితే విజయ్‌కి ప్రమేయం లేకుండా పార్టీని నడుపుతున్నప్పటికీ.. ఆయన సపోర్ట్‌తోనే తండ్రి పార్టీని ఏర్పాటు చేశారంటూ సినీ, రాజకీయ వర్గాలు విమర్శలు ఎక్కువ పెట్టాయి. అయితే తనపై వస్తున్న విమర్శలపై విజయ్ ప్రకటన చేసి వివరణ ఇచ్చారు.

    తండ్రి పార్టీతో సంబంధాలు లేవు

    తండ్రి పార్టీతో సంబంధాలు లేవు

    తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదు. నా అభిమానులు ఎవరూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు. ఆ పార్టీకి మద్దతుగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దు. ఒకవేళ తన పేరును, ఫోటోను వాడుకొన్నట్టయితే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. తనకు సంబంధం లేని పార్టీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని తన ప్రకటనలో పేర్కొన్నారు.

    విజయ్‌తో తండ్రి సంబంధాలపై తల్లి వివరణ

    విజయ్‌తో తండ్రి సంబంధాలపై తల్లి వివరణ

    విజయ్, ఎస్ఏ చంద్రశేఖర్ మధ్య సంబంధాలపై తల్లి వివరణ ఇచ్చారు. గత కొద్దికాలంగా విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని తండ్రి ఒత్తిడి చేస్తున్నారు. అప్పటి నుంచి తన తండ్రితో విజయ్ మాట్లాడటం లేదు. అంతేకాకుండా రాజకీయ పార్టీ పెడుతున్నట్టు తనకు కూడా చెప్పలేదు. పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత మీడియా ద్వారా ఆ విషయాన్ని నేను తెలుసుకొన్నాను అని విజయ్ తల్లి క్లారిటీ ఇచ్చారు.

    నా కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు

    నా కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు

    ఇటీవల విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నా కుమారుడికి నేను స్థాపించిన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నా కుమారుడి అభిమానులను నా పార్టీలో చేరమని చెప్పను. నా కంటూ సొంతంగా విధానాలు, అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తాను. కలిసి వచ్చే వారితో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఒంటరి పోరాటానికి సిద్ధం అని ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు.

    English summary
    Hero Vijay's mother open up about Son's Differences with SA Chandra Shekhar. They have do not have proper relations among them. My husband pressurised vijay to start party. So he Vijay stopped talking with his father.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X