హీరో విక్రమ్...మెంటల్లీ ఛాలెంజెడ్ పర్శన్
విక్రమ్ తాజాగా ఐదేళ్ళ పిల్లాడి మనసతత్వంతో తెరపై కనిపించనున్నారు.ఆయన తాజా చిత్రం దైవ తిరుమగన్ చిత్రంలో విక్రమ్ ఈ పాత్ర చేస్తున్నారు.ఈ చిత్రంలో విక్రమ్ పాత్ర పేరు కృష్ణ. తమిళంలో అనేక సూపర్ హిట్స్ ఇచ్చిన విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు.ఒక హార్ట్‌కు, బ్రెయిన్‌కుమధ్య జరిగే వార్ ఈ చిత్రం అని అంటున్నారు. ఇందులో విక్రమ్ మెంటలీ చాలెంజ్డ్ పర్సన్ గా నటిస్తున్నాడు.
ఇతని భార్య జబ్బు మనిషట. ఈ పాత్రను తమిళ హీరోయిన్ అమల పౌల్ పోషిస్తోంది. విక్రమ్ లాయర్ గా అనుష్క నటిస్తోంది.దర్సకుడు ఈ చిత్రం గురించి చెబుతూ.. విక్రమ్ పాత్ర శారీరకంగా ఎదిగినా మానసికంగా ఐదేళ్ళ పిల్లాడి మనస్సులాగానే మిగిలిపోతుంది.ఆ వయస్సులో ఉండే ప్యూరిటి అది విక్రమ్ ముఖంలో అధ్బుతంగా పండింది. అతన్ని దేవుడు పంపిన గిప్ట్ గా చూపెడుతున్నాం అంటున్నారు.
గతంలో శివపుత్రుడు,శేషు,అపరిచితుడు వంటి చిత్రాలతో విభిన్నమైన నటనను చూపిన విక్రమ్ ఈ చిత్రంతోనూ అందరి ప్రశంశలు పొందుతాడని అందరూ భావిస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం మేలో విడుదల కానుంది.అలాగే ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం ఐయామ్ శామ్ ఆధారంగా రూపొందిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











