ఎన్ టి రామారావుగారిలా నన్ను కూడా..హీరో విక్రమ్ కోరిక
ఎన్.టి. రామారావుగారు, ఎంజీఆర్ గారు... ఇలా మహానటుల గురించి ఇప్పుడు ఎలా చెప్పుకుంటున్నామో వందేళ్ల తర్వాత 'విక్రమ్ అనే హీరో ఉండేవాడట. మంచి నటుడు అట" అని నా గురించి చెప్పుకోవాలన్నదే నా ఆకాంక్ష అంటున్నారు విక్రమ్.ఈ జాతీయ ఉత్తమనటుడు తాజా చిత్రం నాన్న త్వరలో విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలా స్పందించారు.అలాగే..నేను సినిమా ప్రేమికుడ్ని. పాత్ర లావు అవ్వమని కోరితే అలాగే చేస్తాను. సన్నబడమని డిమాండ్ చేస్తే.. అలాగే మౌల్డ్ అవుతా. అంతేగాని విక్రమ్ సూపర్ స్టార్ అని అందరూ పొగడాలని లేదు అని తేల్చి చెప్పారు.
ఇక నాన్న చిత్రంలో పాత్ర గురించి చెబుతూ..ఇప్పటివరకు నేను చేసిన శేతు, శివపుత్రుడు, అపరిచితుడు, రావణ్ వంటి చిత్రాలు ఒక ఎత్తయితే 'నాన్న" మరో ఎత్తు అవుతుంది. ఈ చిత్రంలో ఐదేళ్ల బాలుడికి ఎంత మానసిక ఎదుగుదల ఉంటుందో నాకూ అంతే. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను.12 కిలోలు బరువు తగ్గాను. మానసిక ఎదుగుదల లేనివారిని పరిశీలించి వారి నడక, నడత ఎలా ఉందో క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఈ పాత్ర చేశాను అన్నారు. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం విజయ్ దర్శకత్వంలో ఎం.చింతామణి ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











