విజయ్‌కాంత్ మృతి.. భోరుమని విలపించిన విశాల్.. సలార్ హీరోయిన్ ఎమోషనల్! (వీడియో)
తమిళ సూపర్‌స్టార్, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ మృతితో తమిళ సినిమా రంగమే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమ మూగబోయింది. గత కొద్దికాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం నేపథ్యంలో ఆయన సన్నిహితులు, సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆయనకు సంతాపం వ్యక్తం చేసిన వారిలో..
Recommended Video

సీనియర్ నటుడు, డీఎండీకే నేత తిరు విజయ్‌కాంత్ చెన్నైలో మరణించారు. కరోనా పాజిటివ్‌తో హాస్పిటల్‌లో చేరిన ఆయన కొద్దికాలంగా చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. పేదలకు ఆయన చేసిన సహాయం వల్లే అందరి ప్రేమకు పాత్రుడయ్యాడు. తమిళనాడు ఓ గొప్ప నటుడిని, నేతను కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని సినీ క్రిటిక్ రమేష్ బాలా ట్వీట్ చేశారు.

సలార్ చిత్రం ద్వారా దక్షిణాది సినిమా పరిశ్రమకు మరోసారి పరిచయమైన నటి, వీజే, యాంకర్ శ్రీయారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. విజయ్‌కాంత్ మరణవార్తతో దిగ్బ్రాంతికి గురైన ఆమె సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. విజయ్ సార్.. మిమ్మల్ని ఎప్పటికి ప్రజలు గుండెల్లో పెట్టుకొంటారు. మీరు ఎప్పటికి గుర్తుండిపోతారు అని తన ప్రకటనలో తెలిపారు.
విజయ్‌కాంత్ మరణవార్తతో నా గుండె ముక్కలైంది. రియల్, రీల్ లైప్‌లో కూడా ఆయన హీరో. నన్ను సొంత సోదరుడిలా చేసుకోనే వారు. నేను కూడా ఆయనను అన్నగా భావించేవాడిని. మీ లెగసీ ఎప్పటికి కొనసాగుతుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని హీరో శింబు అన్నారు.

విజయ్‌కాంత్‌కు శాంతి చేకూరాలి. కెప్టెన్ విజయ్‌కాంత్ సార్.. మిమ్మల్ని చూసి మేము గర్వపడుతాం. మా నుంచి మీరు దూరమైన సమయంలో మీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు మా సంతాపం తెలియజేస్తున్నాం అని లైకా ప్రోడక్షన్ ట్వీట్ చేసింది.
విజయ్‌కాంత్ మరణవార్తతో విషాదానికి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని భగవంతుడిని వేడుకొంటున్నాను. ఈ విషాద సమయంలో మనో నిబ్బరంతో ఉండాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకొంటున్నాను అని డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు.
నటుడు విజయ్‌కాంత్ మరణ వార్తతో హీరో విశాల్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన వీడియో రిలీజ్ చేసి తన సంతాపాన్ని, ఆయన గొప్పతనాన్ని చెబుతూ భోరున విలపించారు. ఆయన నాపై చూపించిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోను అంటూ కంటతడి పెట్టుకొన్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











