Vishal: నేను ఏ అమ్మాయితో తిరగలే... ఆ వీడియోపై విశాల్ వింత వాదన!
హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు వాడే అయినప్పటికీ.. తమిళంలో సినిమాలు చేస్తూ.. స్టార్ హీరో అయిపోయాడు విశాల్. అయితే విశాల్ ఇటీవల న్యూయార్క్ లో ఓ అమ్మాయితో అక్కడ వీధుల్లో తిరుగుతూ కనిపించారు. అయితే ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాజాగా విశాల్ ఈ వీడియోపై స్పందించారు. నేను ఏ అమ్మాయితో తిరగలే అంటూ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే...
హీరో విశాల్ వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు వ్యక్తి అయినటు వంటి విశాల్ తమిళంలో సినిమాలు చేస్తూ.. తమిళ స్టార్ హీరోగా ఎదిగారు. ఇక ఆయన సినిమాలు ఇక్కడ కూడా డబ్ అవుతూ వచ్చాయి. ఇక తెలుగు, తమిళ్ లో మంచి మార్కెట్ కైవసం చేసుకున్నారు ఈ కుర్ర హీరో. తమిళంలో ఏ సినిమా చేసినా... ఇక తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చారు.

ఇక ఇటీవల విశాల్ 'మార్క్ ఆంటోనీ' అనే టైం ట్రావెల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ కొట్టారు. ఈ సినిమాలో ఎస్ జే సూర్యతో పాటు.. విశాల్ నటించారు. ప్రస్తుతం 'రత్నం', 'డిటెక్టివ్ 2' సినిమాల్లో నటిస్తున్నారు విశాల్. అయితే గత మూడు రోజులుగా విశాల్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం విశాల్ న్యూయార్క్ సిటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడ వీధుల్లో ఎవరో అమ్మాయితో విశాల్ చక్కర్లు కొడుతూ కనిపించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ అమ్మాయి భూజంపై చేతులు వేసుకుంటూ వెళ్లిన విశాల్... వీడియో తీస్తున్నారని గమనించిన వెంటనే తన మొహాన్ని దాచుకుని వెళ్లిపోయారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
కొందరు నెటిజెన్స్ ఆ అమ్మాయి ఎవరు అంటూ కామెంట్స్ చేశారు. కొంతమంది ఇది కొత్తరకం సినిమా ప్రమోషన్ అంటూ చెప్పుకువచ్చారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఆ వీడియోపై విశాల్ స్పందించారు. విశాల్ తన ట్విట్టర్ లో ఆ వీడియో గురించి స్పందిస్తూ.. సారీ, ఇటీవల నా గురించి ఓ వీడియో వైరల్ గా మారింది. దాని గురించి మీకో విషయం చెప్పాలి అంటూ రాసుకువచ్చారు.
ఇక ఆ వీడియోలో కొంచెం నిజం ఉంది. తాను న్యూయార్క్ లోనే ఉన్నాను అనేది నిజం. రెగ్యులర్ గా సంవత్సరం అంతా కష్టపడి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడానికి న్యూయార్క్ కు వస్తాను. ఇక్కడ నా కజిన్స్ ఉంటారు. ఇక మిగిలిన సగం అది ప్రాంక్ వీడియో. నేను, నా కజిన్స్ క్రిస్మస్ రోజు సరదాగా చేసింది.
నాలో ఉన్న చిన్నపిల్లాడు ఎప్పుడూ బయటకి వచ్చి ఇలా సరదాగా ఎంజాయ్ చేయడానికి ఫిక్స్ అవుతాడు. మీ డిటెక్టివ్ ఆలోచనలకు ఇక ముగింపు పలకండి... కొంతమంది టార్గెట్ చేసి మరీ రాస్తున్నారు.. నేను దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు అంటూ రాసుకువచ్చారు. లవ్ యు ఆల్ అని పోస్ట్ చేశారు విశాల్.


Click it and Unblock the Notifications











