Political Party పొలిటికల్ ఎంట్రీపై తేల్చేసిన విశాల్ .. ఫ్యాన్స్‌తో మీట్ తర్వాత సంచలన ప్రకటన!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విశాల్ మాస్ హీరోగా విశేషంగా అభిమానులను సంపాదించుకొన్నారు. ఆయన నటించిన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడలో కూడా భారీ కలెక్షన్లు రాబడుతాయి. అయితే సినిమాలతోపాటు స్వచ్ఛంద సేవ, రాజకీయాలపై దృష్టిపెట్టడం కూడా జరిగింది. అయితే ఇటీవల ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు ఊపందుకొన్నాయి. ఈ నేపథ్యంలో విశాల్ ఓ ప్రకటనను జారీ చేసి క్లారిటీ ఇచ్చారు. ఆయన తన ప్రకటనలో చెప్పిన విషయాలు ఏమిటంటే?
నాకు ఎంతో గుర్తింపు ఇచ్చిన తమిళనాడు ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నటుడిగా, సామాజిక కార్యకర్తగా నా సేవలను అక్కున చేర్చుకొన్నారు. అందుకు తమిళ ప్రజలకు ఎన్ని థ్యాంక్స్ చెప్పుకొన్న తక్కువే. నా అభిమాన సంఘాలను కేవలం ఫ్యాన్స్‌గానే చూడలేదు. నా స్వచ్చంద సేవకు వారిని ఉపయోగిచుకొన్నాను. పేదలను ఆదుకోవడమే మా లక్ష్యంగా సేవలు సాగాయి అని విశాల్ చెప్పారు.

సమాజ సేవకు మక్కల్ నాల ఇయక్కమ్ అనే సంస్థను ప్రారంభించాం. పేద ప్రజల సేవలు అందించడం కోసం బ్రాంచ్, జోన్, జిల్లా వారీగా విభాగాలు ఏర్పాటు చేశాం. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం స్పూర్తిగా పేద విద్యార్థులను ఆదుకోవడానికి నా తల్లి పేరు మీద దేవీ ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. అలాగే తమిళనాడులోని రైతులను కూడా ఆదుకొనే విధంగా సేవలు అందిస్తున్నాం అని విశాల్ చెప్పారు.
నా షూటింగ్ కోసం ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలను కలిసి మాట్లాడుతాను. అక్కడ ప్రజల సమస్యలను అడిగిత ెలుసుకొని హెల్ప్ చేయడానికి ప్లాన్ చేస్తాను. మక్కల్ నాలా ఇయక్కం ద్వారా నా అభిమానుల సహాయంతో సేవలు చేస్తున్నాను అని విశాల్ తెలిపారు.



Click it and Unblock the Notifications











