అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయిన విశాల్... పోలీసులను ఆశ్రయించిన హీరో
కోలీవుడ్ హీరో విశాల్, తెలుగువారికీ ఎంతో కావాల్సిన వాడు అయిపోయాడు. మంచి కథా కథనాలు ఎంపిక చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద నిలకడగా సాగుతున్న విశాల్, మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఆ మధ్య పెళ్లి వార్త చెప్పి అభిమానుల నోరు తీపి చేసిన ఈ డార్క్ హ్యాండ్సమ్, తాజాగా ఓ ఆర్ధిక వ్యవహారంలో బొక్క బోర్లా పడ్డాడని తెలుస్తోంది.

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో అవకతవకలు
కొంత కాలంగా విశాల్ నిర్మాణ సంస్థ... విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో కలకలం కొనసాగుతుండగా, ఇటీవలే ఆ వ్యవహారం బట్టబయలు అయింది. సంస్థలోని ఆర్ధిక కార్యకలాపాల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహించగా, అసలు సూత్రధారి ఇంటి దొంగే అని తేటతెల్లమయింది.

కోట్లు కొల్లగొట్టిన ఇంటిదొంగ... ఓ అమ్మాయి!
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ మహిళే, ఈ ఆర్ధిక అవకతవకలకు కారణం అని తెలుస్తోంది. ఆరేళ్లు అదే ఆఫీస్ లో పనిచేస్తున్న ఆమె, పలు దఫాల్లో కోట్లు కొల్లగొట్టిందట. ఇటీవలే 45లక్షలు పెట్టి ఆమె ఓ ఇంటిని కొనుగోలు చేయడమూ అనుమానాన్ని మరింత బలపరుస్తోంది. ఈ మేరకు ఆమెపై పడపళని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా, కేసును విరుగంబాక్కమ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
Recommended Video

దర్శకుడిగా మారనున్న విశాల్
మరోవైపు తన కెరీర్ పై పూర్తి దృష్టి నిలిపిన విశాల్, చక్ర అనే క్రైమ్ థ్రిల్లర్ ను స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు మిస్సికిన్ దర్శకత్వంలో తుప్పారివాలన్ 2 అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే మిస్సికిన్ సినిమా నుంచి తప్పుకోవడంతో, దర్శకత్వ బాధ్యతలు కూడా విశాల్ తన భుజం మీదే వేసుకున్నాడని తెలుస్తోంది. మరి, ఇప్పటికే హీరోగా, నిర్మాతగా రాణిస్తున్న విశాల్, దర్శకుడిగాను సత్తా చాటుకుంటాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











